విమాన టికెట్లపై మోడీ ఫొటో దుమారం, వెనక్కి తీసుకుంటామని ప్రకటించిన ఎయిరిండియా
ఢిల్లీ : ఎయిర్ ఇండియా టికెట్లపై ప్రధాని నరేంద్రమోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఫొటోల ముద్రణ వివాదాస్పదంగా మారింది. వైబ్రంట్ గుజరాత్ 2019 అడ్వర్టైజ్‌మెంట్ ఉన్న టికెట్లును సంస్థ జారీ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ అంశంపై దుమారం రేగడంతో ఎయిరిండియా వెనక్కితగ్గింది.
కొత్త టికెట్లు జారీ చేస్తామన్న ఎయిరిండియా
టికెట్లపై మోడీ, విజయ్ రూపానీ ఫొటో ముద్రించడంపై దుమారం రేగడంతో ఎయిర్ ఇండియా స్పందించింది. అది థర్డ్ పార్టీ అడ్వర్టైజ్‌మెంట్ అని స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులు అందినందున వెంటనే ఆ టికెట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పింది. మోడీ ఫోటో ఉన్న టికెట్ల స్థానంలో కొత్తవి జారీచేయనున్నట్లు ప్రకటించింది.

జనవరిలో వైబ్రంట్ గుజరాత్ సదస్సు
వివాదానికి కారణమైన ఎయిరిండియా టికెట్లపై వైబ్రంట్ గుజరాత్ 2019 అడ్వర్జయిజ్‌మెంట్ ముద్రించి ఉంది. వాస్తవానికి జనవరిలో ఈ సదస్సు జరిగింది. ఆ సమయంలో ప్రింట్ చేసిన టికెట్లపై మాత్రమే మోడీ, విజయ్ రూపానీల ఫోటోలతో కూడిన యాడ్ ఉందని ఎయిరిండియా చెబుతోంది. అప్పట్లో బుక్ చేసుకున్న వారి వద్ద మాత్రమే బీజేపీ యాడ్ ఉన్న టికెట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. థర్డ్ పార్టీ అడ్వర్టయిజ్‌మెంట్లతో తమకు సంబంధం లేకపోయినప్పటికీ వివాదానికి కారణమైనందున వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications