వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ వెళ్లాలనుకుంటున్నారా..బ్యాడ్‌న్యూస్: ఆ విమానాలు రద్దు: ఎప్పటివరకు: రీఫండ్‌ ఎలా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్రిటన్ వెళ్ల దలచుకున్న ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. భారత్‌లో పెద్ద ఎత్తున కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతోండటాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్.. పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ విమాన సర్వీసుల రద్దు అమల్లోకి వస్తుంది. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది.

Recommended Video

#Corona #Flight బ్రిటన్ కు విమాన సర్వీసులు నిషేధించిన భారత్

దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,95,041 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,023 మంది మరణించారు. 1,67,457 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది. ఇందులో ఇప్పటిదాకా 1,32,76,039 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,82,553 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 21,57,538కి చేరింది.

Air India cancels flights between India and UK due to restrictions

అటు బ్రిటన్‌లోనూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటిదాకా 43,93,307 కేసులు అక్కడ నమోదయ్యాయి. 1,27,307 మంది మరణించారు. ఈ పరిణామాల మధ్య భారత్‌కు ఇప్పటికే కొన్ని దేశాలు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. హాంకాంగ్, పాకిస్తాన్‌.. తాము నడిపిస్తోన్న విమానాలను రద్దు చేసుకున్నాయి. తాజాగా అదే జాబితాలో బ్రిటన్ కూడా చేరింది. కఠిన ఆంక్షలను విధించింది. ఫలితంగా ఈ నెల 30వ తేదీ వరకు ఆ దేశానికి విమనాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది.

24 నుంచి 30వ తేదీ మధ్యన తమ టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికుల కోసం అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంస్థ వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తెలియజేస్తుంటామని స్పష్టం చేసింది. విమాన సర్వీసుల రీషెడ్యూలింగ్, రీఫండ్ వంటి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. కాగా- ఢిల్లీ, ముంబైల నుంచి వారంలో ఒకసారి బ్రిటన్‌కు విమానాన్ని నడిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఎయిరిండియా తెలిపింది.

English summary
Recent restrictions announced by the UK, flights from/to the UK stand cancelled from 24th to 30th April 2021. Further updates regarding rescheduling, refunds & waivers will be informed shortly: Air India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X