Air India Plane Crash: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్
Air India Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద ఘటనపై ఎయిరిండియా యాజమాన్యం అయిన టాటా గ్రూప్ స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ తామీ భరిస్తామని పేర్కొంది. జే మెడికల్ కాలేజ్ భవనాన్ని పునర్నిర్మిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎయిరిండియా ప్రమాద ఘటన మమ్మల్ని తీవ్రంగా కలిచివేసిందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఆ బాధను వ్యక్తపరచడానికి కూడా మాటలు రావడం లేదన్నారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుండి 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది. చాలా మంది ప్రయాణికులు బతికే అవకాశం లేదని భావిస్తున్నారు. ఎయిర్ ఇండియా తన ట్విట్టర్ పేజీలో నల్లటి డీపీతో తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఈరోజు మధ్యాహ్నం 1.43 గంటలకు కూలిపోయింది. జూన్ 12న మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం బయలుదేరింది.
ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు. దీని తర్వాత, అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి, తరువాత తిరిగి తెరిచారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విమానంలో 11A సీటులో ప్రయాణిస్తున్న విశ్వాస్ కుమార్ అనే ప్రయాణీకుడు ప్రమాదం నుండి బయటపడినట్లు చెబుతున్నారు. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత, ఎయిర్ ఇండియా తన సోషల్ మీడియా పేజీల హోమ్‌పేజీని నలుపు రంగులోకి మార్చింది.












Click it and Unblock the Notifications