నాడు వైఎస్సార్- నేడు విజయ్ రుపాణీ: మరో ఇద్దరు సీఎంల విషాదాంతం
Air India flight Crash: అహ్మదాబాద్ లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 230 మంది ప్రయాణికులు కాగా.. మరో 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ కూడా ఉన్నారు.
ఆయన మరణాన్ని గుజరాత్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 242 మందీ మరణించినట్లు వెల్లడించింది. మృతుల్లో విజయ్ రుపాణీ ఉన్నట్లు తెలిపింది. ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగల్లేదని పేర్కొంది.

అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 ఫ్లైట్ అది. గట్విక్ ఎయిర్ పోర్టుకు చేరాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం 1:39 నిమిషాలకు టేకాఫ్ అయింది. రన్ వే నంబర్ 23ని వీడింది. ఆ కొద్ది సేపటికే కుప్పకూలింది. పెద్ద శబ్దం చేస్తూ.. నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది.
కాగా- విమానం/హెలికాప్టర్ ప్రమాదాల్లో కన్నుమూసిన నాలుగో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ. 2016 నుంచి 2021 వరకు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ రాష్ట్రానికి 18వ సీఎం. రాజ్ కోట్ వెస్ట్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహించారు.
విమాన ప్రమాదంలో మరణించిన రెండో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ. గుజరాత్ రెండో ముఖ్యమంత్రిగా పని చేసిన బల్వంత్ రాయ్ మెహతా.. 1965లో హత్యకు గురయ్యారు. 1965లో భారత్- పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన ప్రయాణిస్తోన్న ఎయిర్ క్రాఫ్ట్ ను పాకిస్తాన్ కూల్చివేసింది. పాక్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ ఖాసీ హుస్సేన్ దీన్ని నేలకూల్చారు.
ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2011 ఏప్రిల్ 11వ తేదీన లోబోథంగ్ లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దోర్జీ ఖండూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన తనయుడు పెమా ఖండూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద దట్టమైన నల్లమల కొండల్లో ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ఈ ఘటన చోటు చేసుకుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications