Air India: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Flight: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి భారత రాజధాని ఢిల్లీకి వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏఐ-379కి శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీని తర్వాత విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం గాలిలో ఉండగా బెదిరింపు మెయిల్ వచ్చిందని.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారుల సూచన మేరకు పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారని ఆ ప్రకటనలో వెల్లడించారు. విమానం అండమాన్ సముద్రం చుట్టూ చక్కెర్లు కొట్టి చివరికి ఐలాండ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలిపారు. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. ఎయిరిండియా విమానం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు బయలుదేరింది. కానీ 20 నిమిషాల ప్రయాణం తర్వాత అండమాన్ సముద్రం చుట్టూ తిరుగుతూ స్థానిక సమయం ప్రకారం ఉదయం 11 గంటల 38 నిమిషాలకు తిరిగి ఫుకెట్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ప్రాథమిక తనిఖీ తర్వాత సంబంధిత ఎయిర్ ఇండియా విమానంలో ఎటువంటి బాంబు దొరకలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది.

ఇదిలా ఉండగా గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇందులో 242 మందిలో 241 మంది మరణించారు. ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్ నుండి లండన్‌కు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు బయలుదేరింది. 1:40 గంటలకు విమానాశ్రయం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. విమానం వెనుక భాగం బీజే మెడికల్ కాలేజీ మెస్ పై పడింది, దీనివల్ల భవనానికి భారీ నష్టం జరిగింది. మెస్‌లో పెద్ద సంఖ్యలో మెడికల్, నర్సింగ్ విద్యార్థులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో 24 మంది మెడికల్, నర్సింగ్ విద్యార్థులు కూడా మరణించారు. కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ రూపానీ కూడా ఉన్నారు, ఆయన తన కుమార్తె, భార్యను కలవడానికి లండన్‌కు వెళ్తున్నారు. ఆయన కూడా ఈ విషాద విమాన ప్రమాదంలో మరణించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications