వామ్మో మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానంలో మంటలు..
ఇటీవల దేశవ్యాప్తంగా విమాన ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. నిత్యం సాంకేతిక సమస్యలతో విమానాలు ఎక్కడపడితే అక్కడ ల్యాండింగ్ అవుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో అనేక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా దిల్లీలో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండింగ్ అయిన కాసేపటికే మంటలు వ్యాప్తి చెందాయి.
దేశ రాజధాని దిల్లీలో ఎయిర్ ఇండియా విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. జులై 22న హాంకాంగ్ నుంచి దిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (IGI)లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తోక భాగంలో మంటలు చెలరేగాయి. అయితే అప్పటికే విమానం నుంచి ప్రయాణికులు దిగి వెళ్లిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో వినానం తోక భాగంలో కొంత దెబ్బతిన్నది.

హాంకాంగ్ నుంచి దిల్లీకి చేరుకున్న AI 315 విమానం ల్యాండింగ్ అయిన కొద్ది సేపటికే ఎలక్ట్రికల్ యూనిట్ నుంచి మంటలు వ్యాపించినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది, ప్రయాణికులను కిందకు దింపేశారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. మంటలు వ్యాప్తి చెందడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అధికారులు.












Click it and Unblock the Notifications