పేలిన ఎయిరిండియా టైరు: పైలెట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
కొచ్చి: ఢిల్లీ-కొచ్చి ఎయిరిండియా విమానం ( AI467) ఈరోజు పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. గురువారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో కొచ్చి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలిపోయింది. విమానం టైర్లు నేలకు తాకగానే ఈ ప్రమాదం సంభవించింది.
అయితే, విమాన పైలెట్ అప్రమత్తంగా వ్వవహరించి విమానాన్ని నియంత్రించడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. విమానం ల్యాండైన సమయంలో విమానంలో మొత్తం 170 మంది ఉన్నారు. ఇందులో 161 మంది ప్రయాణీకులు కాగా, మిగతా 9 మంది విమాన సిబ్బంది.

ప్రస్తుతం విమానాన్ని బెంగుళూరు నుంచి వచ్చిన ఇంజనీర్లు పరిశీలిస్తున్నట్లు ఎయిర్ పోర్టు ఉన్నతాధికారి ఏసీకే నాయర్ తెలిపారు. ఈరోజు 10.20 గంటలకు 138 ప్రయాణీకులతో షార్జా బయలుదేరాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో విమానం ఆలస్యంగా వెళ్లనుంది.












Click it and Unblock the Notifications