రెండు ఐటీ హబ్‌లను కలుపుతూ 18 గంటల నాన్‌స్టాప్ ఫ్లయిట్
ప్రపంచంలోనే ఎక్కువ సేపు ప్రయాణించే నాన్ స్టాప్ ఫ్లయిట్‌ను ఎయిర్ ఇండియా అతి త్వరలో ప్రవేశపెట్టనుంది. భారత్ ఐటీ రాజధాని బెంగుళూరు నుంచి సిలికాన్ వ్యాలీ ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోను కలుపుతూ ఎయిర్ ఇండియా ఓ నాన్ స్టాప్ ఫ్లయిట్ తొలిసారిగా ప్రారంభించనుంది.
మొత్తం 8,700 మైళ్ళు (14,000 కిలోమీటర్లు) ఉన్న ఈ ప్రయాణం సుమారు 17 నుంచి 18 గంటలు పడుతుందని అంచనా వేస్తున్నారు. బెంగుళూరులో టేకాఫ్ ఆయిన ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమానం శాన్ ఫ్రాన్సిస్కోలోనే ల్యాండింగ్ అవుతుంది.
ఈ సర్వీస్‌ని ఎయిర్ ఇండియా ప్రారంభిస్తే ఇదే ఎక్కువ సేపు ప్రయాణించే నాన్ స్టాప్ ఫ్లయిట్ అవుతుందని ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నుంచి ఆస్టేలియాలోని సిడ్నీ మధ్య నడిచే క్వాంటాస్ ఎయిర్ లైన్స్ నడిపే విమాన సర్వీసే ఎక్కువ సేపు ప్రయాణించే ప్లయిట్‌గా చెప్పుకుంటున్నారు.

ఈ రెండింటీ మధ్య దూరం 8,578 మైళ్లు (13,740 కిలోమీటర్లు). అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని ఎయిర్ ఇండియా సొంతం చేసుకోనుంది. ఇప్పటిదాకా శాన్ ఫ్రాన్సిస్కో- ఇండియాల మధ్య ఇలాంటి నాన్ స్టాప్ ఫ్లయిట్ సర్వీస్ లేదనీ, ఈ సర్వీస్ ప్రారంభమైతే సిలికాన్ వ్యాలీలో ఉండే భారతీయులకు ఎంతో ఉపయోగ పడుతుందని ఎయిర్ ఇండియా అధికారులంటున్నారు.
ఈ సర్వీసుని ఫిబ్రవరి 2016లో ప్రారంభించేందుకు ఎయిర్ ఇండియా సన్నాహాలు చేస్తుంది. దీంతో పాటు ఢిల్లీ నుంచి నేరుగా శాన్ ఫ్రాన్సిస్కో కు బోయింగ్ 777 200 లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్‌తో నాన్ స్టాప్ సర్వీస్ ఏర్పాటు చేయాలన్న ప్లాన్‌లో కూడా ఎయిర్ ఇండియా ఉందని అధికారులు చెబుతున్నారు.
కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్‌లో ప్రవాస భారతీయలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఢిల్లీ నుంచి నేరుగా శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. బెంగుళూరు, శాన్ ఫ్రాన్సిస్కోల రెండు సైబర్ హబ్స్‌గా ఎదిగినప్పటికీ ఈ రెండు నగరాల మధ్య నేరుగా ప్లయిట్ లేకపోవడం సాప్ట్‌వేర్ నిపుణులను కాస్తంత ఇబ్బందికి గురి చేస్తుంది.
దీంతో పాటు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణించే ప్రయాణికులను రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆహ్మదాబాద్ నుంచి లండన్‌కు నేరుగా సర్వీసుని ప్రారంభించాలనే ఆలోచనలో ఎయిర్ ఇండియా ఉంది. మరోవైపు సింగపూర్ ఎయిర్ లైన్స్ కూడా సింగపూర్ - న్యూయార్క్ సిటీల మధ్య 19 గంటల నాన్‌స్టాప్ ఫ్లయిట్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications