Air Asia: గవర్నర్‍ను వదిలేసి వెళ్లడంపై విచారణకు ఆదేశించిన ఎయిర్ ఏషియా..
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఎయిర్ పోర్టులోనే విడిచి ఎయిర్ ఏషియా విమానం టేకాఫ్ అయింది. గురువారం మధ్యాహ్నం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ఏషియా విమానం బయలుదేరింది. అయితే ఈ విమానంలో థావర్ చంద్ గెహ్లాట్ రావాల్సి ఉంది. గవర్నర్ ఎక్కకుండానే విమానం టేకాఫ్ అయింది. AirAsia విమానం (I5972)లో గెహ్లాట్ లగేజీని కూడా లోడ్ చేశారు. థావర్ చంద్ గెహ్లాట్ విఐపి లాంజ్ నుంచి విమానం ఎక్కడానికి చేరుకునేలోగానే విమానం వెళ్లిపోయినట్లు ఎయిర్ పోర్టు సిబ్బంది చెప్పారు.
దీంతో అసహానానికి గురైన ఆయన దాదాపు 90 నిమిషాల తర్వాత మరో విమానంలో హైదరాబాద్ వచ్చారు. షెడ్యూల్ ప్రకారం విమానం మధ్యాహ్నం 2:05 గంటలకు బయల్దేరాలి. గవర్నర్ విమానం బయల్దేరడానికి 4 నిమిషాల ముందు వచ్చారని ఎయిర్ ఏషియా తెలిపింది. భద్రతా తనిఖీలు, ఇతర ప్రోటోకాల్ దృష్ట్యా 15 నిమిషాల ముందే రావాల్సి ఉంటుందని తెలిపింది.

ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌ఏషియా "ఈ ఘటనపై మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము. విచారణ జరుపుతున్నామని, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్‌లైన్ సీనియర్ నాయకత్వ బృందం ఆందోళనలను పరిష్కరించడానికి గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. వృత్తి నైపుణ్యం మరియు ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండటం" అని తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే, గవర్నర్ ప్రోటోకాల్ అధికారి ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనగా పేర్కొంటూ విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌కు 15 నిమిషాల ముందు చేరుకున్నప్పటికీ, గురువారం హైదరాబాద్‌కు విమానంలో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కార్యాలయం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్, ఎయిర్‌ఏషియాకు లేఖ రాసింది. ఈ ఘటన గవర్నర్‌కు ఇబ్బంది కలిగించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్ ఏషియా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications