ఎయిర్‌సెల్ నుంచి బంపర్ ఆఫర్.. రూ.3కే 1జీబీ 3జీ డేటా

ఎయిర్‌సెల్ మరో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. ‘గుడ్ మార్నింగ్ ప్యాక్’ పేరుతో కేవలం మూడు రూపాయలకే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 1జీబీ 3జీ డేటాను ఇస్తున్నట్టు తెలిపింది.

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో పుణ్యమా అని వినియోగదారులు ఆఫర్ల వర్షంలో మునిగి తేలుతున్నారు. టెలికాం నెట్ వర్క్ కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఖాతాదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నిన్న వొడాఫోన్ రూ.6కే అపరిమిత డేటా ఆఫర్ ప్రకటించగా, మంగళవారం బీఎస్ఎన్ఎల్ రూ.5కే రోజుకు 4జీబీ 3జీ డేటాను ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడి గంటలైనా కాకముందే ఎయిర్‌సెల్ మరో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది.

aircel

కేవలం మూడు రూపాయలకే 1జీబీ 3జీ డేటాను ఆఫర్ చేస్తూ ఎయిర్‌సెల్ ప్రకటన విడుదల చేసింది. 'గుడ్ మార్నింగ్ ప్యాక్' పేరుతో కేవలం మూడు రూపాయలకే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 1జీబీ 3జీ డేటాను ఇస్తున్నట్టు తెలిపింది.

అయితే ఇది కేవలం జమ్ముకశ్మీర్ సర్కిల్‌కు మాత్రమే వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు వినియోగదారులు *121*100# డయల్ చేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+