జియోకు ఝలక్ ఇచ్చిన ఎయిర్ టెల్, బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు 1000 జీబీ బోనస్‌ డేటా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: త్వరలోనే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా సంచలనాలు సృష్టించాలని రిలయన్స్‌ జియో ప్రణాళికలు రచిస్తుండగా.. దానికంటే ముందుగా ఎయిర్‌టెల్‌ కూడా తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తోంది.

జియో ఫోన్ ఎఫెక్ట్‌: ఎయిర్‌టెల్‌ కొత్త ఎత్తుగడ!

తాజాగా తన వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్‌ కొత్త బోనస్‌ డేటా ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కింద కొత్త కస్టమర్లకు 1000 జీబీ వరకు అదనపు డేటా అందించనున్నట్టు పేర్కొంది. ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తున్న చౌకైన ప్లాన్లు రూ.899 నుంచి ప్రారంభమవుతాయయి.

Airtel ups ante against Jio, offering up to 1000 GB bonus data

దీని కింద నెలకు 60 జీబీ డేటాను, అదనంగా ఏడాదిలో 50 0జీబీ డేటాను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ఈ ప్లాన్‌ స్పీడు 40 ఎంబీపీఎస్‌ వరకు ఉంటుంది.

మరో ప్లాన్‌ రూ.1099 కింద అదే 40 ఎంబీపీఎస్‌ స్పీడులో నెలకు 100 జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నామని, అంతేకాక 1000 జీబీ బోనస్‌ డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు ప్రకటించింది. 

మీరు ఎయిర్ టెల్ కస్టమరా? అయితే ఈ బంపర్ ఆఫర్ మీకే!

ఇలా రూ.1299, రూ.1499, రూ.1799 ప్లాన్లకు కూడా 1000 జీబీ వరకు బోనస్‌ డేటాను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. కానీ ఇవన్నీ కొత్త కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుతం రిలయన్స్‌ జియో కూడా తన ఫైబర్‌ నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేయడానికి టెస్టింగ్‌ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని లాంచ్‌ చేసింది కూడా. కానీ దేశవ్యాప్తంగా లాంచ్‌ చేయడానికి జియో ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Airtel New Offers Vs Reliance Jio : War Of Offers - Oneindia Telugu

ఇప్పటికే జియో ఎంట్రీతో తీవ్ర కుదుపులోకి లోనైన టెలికాం దిగ్గజాలు, బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లో జియోకు కౌంటర్‌ ఇచ్చేందుకు ముందస్తుగానే సన్నద్ధమవుతున్నాయి. వీటిని జియో ఎలాంటి ప్లాన్లతో ఎదుర్కొంటుందో మరికొన్ని నెలల్లో తేలిపోనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Airtel has recently announced new bonus data offer for its new customers under which it is offering as much as 1000 GB extra data. The cheapest plan starts at Rs 899 for which you will get 60 GB of data per month and extra 500 GB data for the year. As per Airtel website, the plan offers speed up to 40 Mbps.There is a Rs 1099 plan that offers up to 40 Mbps speed, 100 GB data per month and 1000 GB bonus data.A Rs 1,299 plan offers 130 GB data per month at up to 100 Mbps speed and under this you will get up to 1000 GB bonus data which you can avail as soon as you exhaust your monthly data quota. There are Rs 1,499 and Rs 1,799 plans that offer 160 GB and 225 GB data respectively and ofcourse both of them come with 1000 GB bonus data offer.
Please Wait while comments are loading...