గోవధకు వ్యతిరేకంగా ఫత్వా.. ట్రిపుల్ తలాక్ పై నిషేధం
ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డుమూడు కీలక తీర్మానాలు ఆమోదించింది. గోవధకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడమేకాక, ట్రిపుల్ తలాక్ నిషేధానికి మద్దతు పలికింది.
న్యూఢిల్లీ: ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డు (ఏఐఎస్‌పీఎల్‌బీ) బుధవారం మూడు కీలక తీర్మానాలు ఆమోదించింది. దేశంలో కలకలం రేపుతున్న గోవధకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడమేకాక, ట్రిపుల్ తలాక్ నిషేధానికి మద్దతు పలికింది.
అంతేకాదు, రామ జన్మభూమి-బాబ్రీ మసీదు విషయాన్ని కోర్టు బయట చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. లక్నోలో బుధవారం జరిగిన ఏఐఎస్‌పీఎల్‌బీ కార్యవర్గ సమావేశంలో కీలకమైన గోవధను నిషేధిస్తూ ఫత్వాను జారీ చేశారు.

ఇరాక్ కు చెందిన ప్రముఖ షియా మతపెద్ద అయాతుల్లా షేక్ బషీర్ హుస్సేన్ నజఫీ నుంచి అనుమతి తీసుకున్న అనంతరం షియా బోర్డు గోవధకు వ్యతిరేకంగా ఫత్వాను అమల్లోకి తీసుకొచ్చింది. గోవధ కారణంగా దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని, అందుకే ఈ ఫత్వా జారీ చేశామని షియా బోర్డు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications