పాక్ పై నెక్స్ట్ స్టెప్ ఇదే, ఇక తప్పదు - అమెరికా, చైనాకు తేల్చి చెప్పిన భారత్..!!

ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతోంది. అటు ప్రపంచ దేశాలకు భారత్ ఆపరేషన్ సింధూర్ గురించి స్పష్టత ఇచ్చింది. ఉగ్రవాదుల క్యాంపుల పైనే దాడులు జరిగాయని స్పష్టం చేసింది. పాక్ నుంచి రెచ్చగొట్టే చర్యలు ప్రారంభిస్తే భారత్ ఊహించని విధంగా సమాధానం ఉంటుందని తేల్చి చెప్పింది. భారత్ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించదని హామీ ఇచ్చింది.

మా లక్ష్యం ఒక్కటే
ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. పాకిస్థాన్ ఇప్పటికీ భారత్ పైన దుష్ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారుల దోవల్ పలు కీలక దేశాలతో సంప్రదింపులు చేసారు. ఉద్రిక్తతలు పెంచాలనే ఉద్దేశం భారత్‌కు లేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడిన అజిత్‌ డోభాల్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి భద్రతా సలహాదారులకు వివరించారు. అమెరికా, రష్యా, యూకే జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడారు. చైనా, ఫ్రాన్స్‌, సౌదీ, జపాన్ జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడిన డోవల్ పాక్ గనుక ఉద్రిక్తతలు పెంచాలని ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని తేల్చి చెప్పారు. భవిష్యత్తులోనూ మా మిత్రదేశాలతో సమాచారం పంచుకుంటామని అజిత్‌ డోవల్ వెల్లడించారు.

ajit-doval-clarifies-that-india-well-prepared-to-retaliate-resolutely-if-islamabad-provocates

అప్రమత్తం

అటు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం నేల మట్టం చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టింది. దీని తరువాత పాకిస్థాన్ నేత లు ఇంకా భారత్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. పాక్ ఏదైనా రెచ్చగొట్టే చర్యలకు దిగితే ఎలా స్పందించాలనే దాని పైన ఇప్పటికే భారత్ ఒక ప్రణాళిక సిద్దం చేసుకుంది.

ప్రపంచ దేశాలు ఎలాంటి స్పందన వద్దంటూ పాక్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. అటు భారత్ ముందస్తు చర్యలు మెదలు పెట్టింది. సరిహద్దు రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ చర్చలు చేసారు. పలు సూచనలు అందించారు. ఇటు రాష్ట్రపతితో ప్రధాని భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. పాక్ నుంచి తిరిగి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్పేలా భారత్ సిద్దం అవుతోంది. అమెరికాతో పాటుగా చైనా భద్రతా సలహాదారులతోనూ అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+