Ajit Doval ఇంత ఓపెన్ సీక్రెట్ బయటపెట్టారేంటి?
భారత జాతీయ భద్రతకు ప్రతీకగా నిలిచిన పేరు అజిత్ దోవల్. అత్యాధునిక డిజిటల్ యుగంలో ప్రపంచం మొత్తం మొబైల్ ఫోన్‌లు, ఇంటర్నెట్ చుట్టూనే తిరుగుతున్న వేళ... దేశ భద్రతకు అత్యంత కీలకమైన పదవిలో ఉన్న ఆయన మాత్రం వీటికి పూర్తిగా దూరంగా ఉంటారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెళ్లడించారు. దేశం గురించి, తనకు అప్పగించిన పని గురించి మాత్రమే ఎప్పుడూ పరితపించే దోవల్.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఈ కీలక విషయాన్ని బయటపెట్టడం వెనకున్న వ్యూహం ఏంటి? అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్న వేళ.. ఆయన రివీల్ చేసిన ఈ సీక్రెట్ దేనికి సంకేతం?
అజిత్ దోవల్.. జాతీయ భద్రతకు మరో పేరు చెప్పండి అంటే సగర్వంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి. ఎప్పుడు బయటకి కనిపించని ఈయన.. ఓ వేదికపై ప్రత్యక్షమయ్యారు. అది కూడా హైలెవల్ సీక్రెట్ మీటింగ్ ఏమి కాదు.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి దోవల్ జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లిపోలేదు. అక్కడికి వచ్చిన యువతతో ముచ్చటించారు, భారత్ మండపంలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో తన పని విధానం గురించి కీలక విషయాలు.. దేశ యువతకు చెప్పేశారు. రోజువారీ వృత్తి పరమైన కార్యకలాపాల్లో తాను మొబైల్ ఫోన్‌లు, ఇంటర్నెట్‌ను ఉపయోగించనని ఆయన స్పష్టం చేశారు. "నేను ఇంటర్నెట్ వాడను అన్నది నిజమే" అని ఆయన చెప్పడం అక్కడున్న యూత్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే పూర్తిగా ఫోన్ వాడనని కాదు. కుటుంబానికి సంబంధించిన అవసరాలు, విదేశాల్లోని వ్యక్తులతో మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ఉపయోగిస్తానని దోవల్ వివరించారు. "కమ్యూనికేషన్‌కు అనేక మార్గాలున్నాయి. ప్రజలకు తెలియని మరికొన్ని ప్రత్యేక పద్ధతులు కూడా ఉంటాయి. నా పని నేను ఆ విధంగానే నిర్వహిస్తాను" అని ఆయన చెప్పడం భద్రతా వ్యవస్థల లోతును సూచించింది.
దోవల్ బయోడేటా..
భారతదేశానికి ఐదవ జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగుతున్న అజిత్ దోవల్, కేరళ కేడర్‌కు చెందిన పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి. నిఘా, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యల్లో దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. 1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన దోవల్, 1968లో ఐపీఎస్‌లో చేరి అసాధారణ కెరీర్‌ను నిర్మించుకున్నారు. ధైర్యసాహసాలకు గాను కీర్తి చక్రను అందుకున్న అతి పిన్న వయస్కుడైన పోలీసు అధికారిగా చరిత్రలో నిలిచారు.
పాక్ లో సీక్రెట్ ఏజెంట్ గా..
తిరుగుబాట్లు తీవ్రంగా ఉన్న మిజోరాం, పంజాబ్, ఈశాన్య భారత ప్రాంతాల్లో ఆయన నిర్వహించిన ఆపరేషన్లు ఇప్పటికీ భద్రతా వర్గాల్లో ఉదాహరణగా చెప్పుకుంటారు. అంతేకాదు, పాకిస్తాన్‌లో ఎన్నో సంవత్సరాలు అజ్ఞాతంలో పనిచేసిన అనుభవం కూడా దోవల్‌కు ఉంది. 1999 కందహార్ విమాన హైజాకింగ్ సమయంలో చర్చలు జరిపిన కీలక వ్యక్తుల్లో ఆయన ఒకరు. 1971 నుంచి 1999 మధ్య జరిగిన అనేక విమాన హైజాకింగ్ ఘటనలను సమర్థవంతంగా పరిష్కరించడంలో ఆయన పాత్ర కీలకం.
దేశ భద్రతకు సంబంధించిన ఆధునిక చరిత్రలో కూడా దోవల్ పేరు విడదీయరానిది. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులు, డోక్లాం ప్రతిష్టంభన వంటి సున్నితమైన సందర్భాల్లో ఆయన వ్యూహాత్మక ఆలోచనలే భారత్‌కు బలం అయ్యాయి. అంతర్గత భద్రతా విధానాల రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
పాకిస్తాన్ నుంచి సైబర్ దాడి..
డిజిటల్ యుగంలో డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండే ఆయన వ్యక్తిత్వమే కొన్నిసార్లు అపోహలకు దారి తీసింది. గత ఏడాది అజిత్ దోవల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారమైన ఓ నకిలీ ఫేస్‌బుక్ పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ నుంచి సైబర్ దాడి ముప్పు ఉందంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), దోవల్‌కు ఎలాంటి అధికారిక ఫేస్‌బుక్ ఖాతా లేదని, ఆయన పేరు, ఫోటోతో వైరల్ అయిన ఆ పోస్ట్ పూర్తిగా నకిలీదేనని స్పష్టం చేసింది.
మొత్తంగా చూస్తే... అత్యాధునిక టెక్నాలజీపై ఆధారపడకుండా, క్రమశిక్షణ, రహస్యత, ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థలతో దేశ భద్రతను నడిపిస్తున్న వ్యక్తి అజిత్ దోవల్. ఆయన పని శైలి యువతకు ఒక బలమైన సందేశం సాధనాలు కాదు, ఆలోచనలే నిజమైన శక్తి అని.
వ్యూహమా.?. ఎండ్ కార్డ్ హా?
అయితే ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని బయటపెట్టని ఆయన ఈ రోజు దేశ యువతకి తన కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి చాలా కీలకమైన సమాచారన్ని బయటపెట్టడంతో చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని ఎవరికైనా చెప్పాలని ఆయన భావించి బయటపెట్టారా.. లేక తన సోషల్ మీడియా అకౌంట్స్ పట్ల జరుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డ్ వేయడానికి చెప్పారా అనేది చర్చ. మీరేం అనుకుంటున్నారు
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications