ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగికి గుండెపోటు, వెంటిలేటర్‌పై చికిత్స, పరిస్థితి విషమం..

ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం, ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగికి గుండె పోటు వచ్చింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటి వద్ద హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. అతనికి వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నారని.. పరిస్థితి విషమంగానే ఉంది అని వైద్యులు బులెటిన్‌లో తెలిపారు.

తన ఇంటి వద్ద గల గార్డెన్‌లో కుప్పకూలి పడిపోవడంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. అజిత్ జోగితో ఆస్పత్రి వద్ద భార్య రేణు జోగి, ఎమ్మెల్యే, కుమారుడు అమిత్ జోగి ఉన్నారు. అజిత్ జోగి.. బ్యూరోక్రాట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు.

Ajit Jogi Suffers Cardiac Arrest, Put On Ventilator, Condition Serious

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. 2000 నవంబర్ నుంచి 2003 నవంబర్ వరకు సీఎంగా కొనసాగారు. 2016లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత చత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అధికారం చేపట్టే అంతా ప్రభావం మాత్రం చూపలేదు. కొన్ని సీట్లను గెలచుకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+