అజిత్ పవార్ విమాన ప్రమాద సీసీటీవీ వీడియో విడుదల: ఆఖరి క్షణాల్లో ఏం జరిగింది?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలను బలిగొన్న విమాన ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతోంది. బారామతి ఎయిర్పోర్టు సమీపంలోని హైవేపై ఉన్న ఓ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. బుధవారం ఉదయం సుమారు 8.46 గంటలకు విమానం ల్యాండింగ్ కావాల్సి ఉంది.
రన్‌వేకు కొద్ది దూరంలోనే ఆకాశం నుంచి విమానం వేగంగా కిందికి రావడం, ఒక్కసారిగా పెద్ద అగ్నిగోళంలా మారి కుప్పకూలడం వీడియోలో కనిపిస్తోంది. విమానం నేలకు తగిలిన వెంటనే భారీ ఎత్తున నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా విమానంలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

ప్రమాదానికి కారణం 'దట్టమైన పొగమంచు'?
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రాథమిక సమాచారం ప్రకారం.. దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్ కావడానికి ఇబ్బంది పడింది. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో, రెండోసారి ల్యాండింగ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు. విజిబిలిటీ (కనిపించే దూరం) చాలా తక్కువగా ఉండటంతో విమానం రన్‌వే థ్రెషోల్డ్ నుంచి పక్కకు దూసుకెళ్లి పేలిపోయింది.
Maharashtra Deputy Chief Minister and senior Nationalist Congress Party leader Ajit Pawar tragically died in a plane crash this morning (near Baramati Airport in Pune district, Maharashtra. He was 66 years old. #CCTV pic.twitter.com/9wcEELzgag
— NextMinute News (@nextminutenews7) January 28, 2026
రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు
అజిత్ పవార్ మృతి పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి తీరని లోటని పేర్కొంటూ.. మహారాష్ట్రలో రేపు (జనవరి 29) సెలవు ప్రకటించడంతో పాటు మూడు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అజిత్ పవార్ మృతికి సంతాపం తెలుపుతూ ఆయన పరిపాలనా దక్షతను గుర్తు చేసుకున్నారు.
దర్యాప్తు ముమ్మరం
ప్రమాదంపై విచారణకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) రంగంలోకి దిగింది. విమానంలోని ఫ్లైట్ రికార్డర్, ఇంజిన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. 16 ఏళ్ల వయస్సున్న ఈ విమానం పాత రికార్డులను, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సంభాషణలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మహారాష్ట్ర చరిత్రలో 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన రికార్డు అజిత్ పవార్ సొంతం. ఆయన మృతితో అటు పవార్ కుటుంబంలో, ఇటు ఎన్సీపీ (NCP) పార్టీలో తీరని శూన్యం ఏర్పడింది. ఆయనకు భార్య సునేత్రా పవార్, కుమారులు జయ్, పార్త్ ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications