మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అజిత్ పవార్ బయటకు?
మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏక్ నాథ్ షిండే శివసేన - బీజేపీ కూటమిని ఓడించాలనే పట్టుదలతో కాంగ్రెస్-శరద్ వవార్ - ఉద్ధవ్ థాక్రే మహావికాస్ అఘాడీ పట్టుదలతో ఉంది. కొంకణ్ ప్రాంతంలోని చిప్లన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ మాట్లాడుతూ తామంతా కుటుంబ సభ్యులుగా కలిసే ఉన్నామని, కాకపోతే ఆయన మరో పార్టీకి నేతృత్వం వహిస్తున్నారని పరోక్షంగా అజిత్ పవార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొందరు విలేకరులు పవార్ లు ఇద్దరూ ఏకం కావాలనే డిమాండ్లు వస్తున్నాయికదా.. దీనికి మీ సమాధానం ఏమిటి? అనే ప్రశ్నకు శరద్ పవార్ పైవిధంగా జవాబిచ్చారు.
తన భార్యను పోటీచేయించడం తప్పైంది
అజిత్ పవర్ ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ శరద్ పవర్ కుమార్తె సుప్రియా సూలేపై తన భార్య సునేత్ర పవార్ ను పోటీచేయించడం తప్పైందని చెప్పారు. ఇదే విషయాన్ని విలేకరులు తిరిగి ప్రశ్నించగా ఆయన వేరే పార్టీలో ఉన్నారుకదా.. ఆ పార్టీ తీసుకునే నిర్ణయాల గురించి మనమెందుకు మాట్లాడాలని, అది ఆ పార్టీ సొంత నిర్ణయం అన్నారు. రాబోయే ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన బలంగా చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయం గురించి ప్రశ్న ఎదురవగా ప్రస్తుతం తాము ఇది అత్యంత అవసరమైన సమస్యగా భావించడంలేదన్నారు.

ప్రభుత్వంలో కొనసాగకపోవచ్చు
దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా మోరార్జీ దేశాయ్ పేరును ముందుగానే వెల్లడించలేదనే విషయాన్ని శరద్ పవార్ గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి పట్టడం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు తమకు స్పష్టమవుతోందన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్ సీపీని చీల్చి అజిత్ పవార్ ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 9 సీట్లు గెలుచుకోగా మహావికాస్ అఘాడీ 30 సీట్లను గెలుచుకుంది. దీంతో షిండే ప్రభుత్వంలో అజిత్ పవర్ కొనసాగకపోవచ్చనే ఊహాగానాలు వినపడుతున్నాయి.












Click it and Unblock the Notifications