వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశ్‌కు బీజేపీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు.. బహిష్కరణ తప్పదా..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఇండోర్ మున్సిపల్ సిబ్బందిపై బ్యాటుతో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియ దాడి చేయడాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే వివరణ ఇవ్వాలని చెప్పిన హైకమాండ్ .. ఎక్స్‌ప్లానేషన్‌తో సంతృప్తి చెందలేదు. దీంతో బీజేపీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీచేసింది. దాడికి గల కారణాలు వివరించాలని స్పష్టంచేసింది.

ఉపేక్షించం ..
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ .. ఆకాశ్ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. బ్యాటుతో కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎవరి కుమారుడైనా సరే .. తప్పు చేస్తే శిక్షించాల్సిందేనని కుండబద్దలుకొట్టారు. ఆ తర్వాతే బీజేపీ వివరణ ఇవ్వాలని ఆకాశ్‌ను కోరింది. తర్వాత ఇవాళ బీజేపీ క్రమశిక్షణ కమిటీ నోటీసలుు జారీచేసింది. షోకాజు నోటీసులకు ఆకాశ్ ఇచ్చే వివరణను బట్టి చర్యలు ఉంటాయి. ఆకాశ్ సమాధానంతో సంతృప్తి చెందకుంటే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది.

Akash Vijayvargiya, who hit officer with cricket bat, issued notice by BJP

ఏం జరిగిందంటే ..?
గత నెల 26న ఇండోర్ మున్సిపాల్ కార్యాలయం వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ హంగామా సృష్టించాడు. ఇండోర్ మున్సిపాలిటీ వద్ద అధికారిపై తిట్లపురాణం ప్రారంభించాడు. కోపం ఆపుకోలేక అక్కడే ఉన్న బ్యాటుతో దాడి చేశాడు. అతను దాడిచేస్తున్న సమయంలో ప్రజలు అక్కడే ఉన్నారు. అయినా ఏం బెదరకుండా తన పనిని పూర్తిచేశాడు. ఏం జరిగిందని అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆకాశ్‌ను అడగ్గా .. అధికారులు అక్రమంగా ఓ భవనాన్ని కూల్చివేశారని పేర్కొన్నాడు. ఆ భవనాన్ని కూల్చివేయాలని యాజమాని కార్పొరేషన్ కోరడం విశేషం. అయితే అందులో కొందరు నివసిస్తున్నారని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. ఇదే విషయం అడిగేందుకు ఫోన్ చేస్తే తన కాల్ లిప్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటువేసిన ప్రజలకు ప్రతినిధినని .. వారికి సంబంధించి బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. అయితే తనను మళ్లీ సంప్రదించకుండా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపగించుకున్న ఆకాశ్ .. మున్సిపల్ అధికారిపై చేయిచేసుకున్నాడు.

English summary
BJP lawmaker Akash Vijayvargiya has been issued show cause notice by the Bharatiya Janata Party asking him to explain why he thrashed beat a civic officer with a cricket bat in Indore, news agency ANI said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X