అప్రమత్తంగా ఉండండి, నకిలీ భాబాలు వీరే: అఖార పరిషత్

అలహబాద్: నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత అఖార పరిషత్ ప్రజలను కోరింది.దేశంలో నకిలీ బాబాల జాబితాను పరిషత్ విడుదల చేసింది. దేశంలో 17 మంది నకిలీ బాబాలు ఉన్నారని పరిషత్ ప్రకటించింది.

తమను తాము భగవంతుని అవతారం చెప్పుకునే నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత అఖార పరిషద్‌ కోరింది. దేశంలో 17 మంది నకిలీ బాబాలు ఉన్నారని పేర్కొంటూ తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. గుర్మీత్ రామ్‌ రహీమ్‌ సింగ్‌, రాధేమా, నిర్మల్‌ బాబా, రాంపాల్‌, ఆశారామ్‌ బాపు సహా 14 మంది పేర్లతో సెప్టెంబర్‌లో మొదటి లిస్ట్‌ తయారు చేసింది.

Akhada Parishad Releases 2nd List of Fake Babas, Names Virendra Dev Dixit After Ashram Scandal

మరో ముగ్గురి పేర్లను జతచేసి తాజా జాబితా విడుదల చేసింది. వీరేంద్ర దేవ్‌ దీక్షిత్‌, సచిదానంద సరస్వతి, త్రికాల్‌ భవంత్‌ పేర్లను జోడించింది. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలో వీరేంద్ర దేవ్‌ నిర్వహిస్తున్న మూడు ఆశ్రమాల నుంచి గతవారం 47 మంది మహిళలు, ఆరుగురు మైనర్‌ బాలికలను పోలీసులు కాపాడారు.

దొంగ బాబాల గురించి సామాన్య ప్రజలు తెలుసుకునేందుకు ఈ జాబితా తయారుచేసినట్టు అఖిల భారత అఖార పరిషద్‌ అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి తెలిపారు. సాధువులు, సన్యాసులకు చెడ్డపేరు తీసుకువస్తున్న నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+