అయోధ్య రామయ్యకు కానుకగా చీపురు: దేనితో తయారు చేశారో తెలుసా?
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. బాల రాముడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. చలిని సైతం లెక్క చేయట్లేదు. రోజూ రెండు లక్షలమందికి పైగా భక్తులు రాములోరిని దర్శించుకుంటోన్నారు.
ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు. తెల్లవారు జామున 6: 30 గంటలకు జాగరణ్ హారతిని స్వామవారికి ఇస్తారు.

మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. సాయంత్రం 7: 30 గంటలకు సంధ్యా హారతితో తలుపులను మూసివేస్తారు. స్వామివారి సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్ సైట్ https://online.srjbtkshetra.org/#/loginను సందర్శించాల్సి ఉంటుంది.
రామాలయానికి కానుకలు అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు రకాల కానుకలు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందాయి. సీతమ్మ తల్లి జన్మించిన జనక్‌పురి నుంచి నేపాల్ ప్రభుత్వం వెండి విల్లంబులను పంపించింది.
ఆలయం ప్రారంభమైన మూడో రోజున మహారాష్ట్రకు చెందిన నీలేష్ అరుణ్ సకార్ అనే భక్తుడు ఏడు అడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉండే ఓ నందకాన్ని ఆలయానికి కానుకగా సమర్పించారు. దీని బరువు 80 కేజీలు. దశావతారాల్లో నందకానికి ఎంత ప్రాముఖ్యత ఉందనే విషయం తెలిసిందే.
#WATCH | Ayodhya: Devotees of Shri Ram from the 'Akhil Bharatiya Mang Samaj' donate a silver broom to the Ram Janambhoomi Teerth Kshetra Trust, with a request that it be used for cleaning the Garbha Griha.
— ANI (@ANI) January 28, 2024
The silver broom weighs 1.751 kg. pic.twitter.com/K9Mgd6HnMZ
తాజాగా- అఖిల భారతీయ మాంగ్ సమాజ్ భక్తులు రామ మందిరానికి చీపురు కానుకగా సమర్పించారు. వెండితో తయారు చేసిన చీపురు ఇది. 1.751 కేజీల వెండిని దీనికోసం వినియోగించారు. ఈ ఉదయం ప్రదర్శనగా ఈ వెండి చీపురును అయోధ్యకు తీసుకొచ్చారు. తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బాల రాముడి గర్భాలయాన్ని ఈ వెండి చీపురుతో శుభ్రం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications