వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో మూడో దశ పోలింగ్ - 59 సీట్లు..16 జిల్లాలు : అఖిలేష్ నియోజకవర్గం సైతం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న ఉత్తరప్రదేశ్ మూడో దశ పోలింగ్ కు ఏర్పాట్లు జరగుతున్నాయి. ప్రచారం ముగియటంతో..ఇక, ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహణ పైన ఫోకస్ పెట్టింది. యూపీలో మొత్తం ఏడు దశలకు గానూ, ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఈ నెల20న జరిగే మూడో విడత పోలింగ్ పైన అన్ని పార్టీలు భారీ అంచనాలతో ఉన్నాయి. ప్రధానంగా ఈ మూడో విడత పోలింగ్ జరిగే జిల్లాల్లో బీజేపీ వర్సెస్ ఎస్పీ అన్నట్లుగా పరిస్థితి మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మూడో విడత మొత్తంగా యాదవ సామాజికవర్గం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జరగనుంది. 16 జిల్లాల్లోని 59 సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ యూపీలోని అయిదు జిల్లాలు.. అవ్దా రీజియన్ లోని అయిదు జిల్లాలు..బుందేల్ ఖండ్ పరిధిలోని అయిదు జిల్లాలు ఉన్నాయి.

మూడో విడతలో కీలక నియోజకవర్గాలు

మూడో విడతలో కీలక నియోజకవర్గాలు

ఫిరోజాబాద్..మణిపూరి, ఈటా, ఖాస్ గంజ్, హాత్రాస్ .. కాన్పూర్, కాన్పూర్ దోహట్, ఔరారియా, కన్నౌజ్, ఈటావా, ఫరూఖాబాద్, జాన్సీ, జలౌన్, లలిత్ పూర్, హమీర్ పూర్ తో పాటుగా మహాబాలో పోలింగ్ జరగనుంది. 20వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మూడో దశ పోలింగ్ లో కీలక నియోజకవర్గాలైన ఈటా, మర్హారా, జలేసర్ (ఎస్సీ), మైన్‌పురి, భోంగావ్, కిష్ని (ఎస్సీ), కర్హల్, కైమ్‌గంజ్ (ఎస్సీ), అమృత్‌పూర్, ఫరూఖాబాద్, భోజ్‌పూర్, ఛిబ్రామౌ, తిర్వా, కన్నౌజ్ (ఎస్సీ), జస్వంత్‌నగర్, ఇటావా, భర్తానా (ఎస్సీ), హత్రాస్ (ఎస్సీ), సదాబాద్, సికంద్ర రావు, తుండ్ల (ఎస్సీ), జస్రానా, ఫిరోజాబాద్, షికోహాబాద్, సిర్సాగంజ్, కస్గంజ్, అమన్‌పూర్, పటియాలీ, అలీగంజ్, బిధునా, దిబియాపూర్, ఔరయ్య (ఎస్సీ), రసూలాబాద్ (ఎస్సీ) ఉన్నాయి.

96 మంది మహిళలు బరిలో

96 మంది మహిళలు బరిలో

అక్బర్‌పూర్-రానియా, సికంద్ర, భోగ్నిపూర్, బిల్హౌర్ (ఎస్సీ), బితూర్, కళ్యాణ్‌పూర్, గోవింద్‌నగర్, సిషామౌ, ఆర్య నగర్, కిద్వాయ్ నగర్, కాన్పూర్ కాంట్., మహారాజ్‌పూర్, ఘతంపూర్ (ఎస్సీ), మధుఘర్, కల్పి, ఒరై (ఎస్సీ), బబినా, ఝాన్సీ నగర్, మౌరానీపూర్ (ఎస్సీ) , గరౌత, లలిత్‌పూర్, మెహ్రోని (ఎస్సీ), హమీర్‌పూర్, రాత్ (ఎస్సీ), మహోబా మరియు చరఖారి ఉన్నాయి. మూడో విడత లో ఎన్నికలు జరిగే 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 627 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. అందులో 96 మంది మహిళలు ఉన్నారు.

Recommended Video

UP Elections 2022 : First Phase Polling Completed,Polling Percentage Is ? | Oneindia Telugu
అఖిలేష్ పోటీ నియోజకవర్గం సైతం

అఖిలేష్ పోటీ నియోజకవర్గం సైతం

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన పైన బీజేపీ నుంచి కేంద్ర మంత్రి సింగ్ భగేల్ పోటీ చేస్తున్నారు. మూడో విడతలో ఇక్కడ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. జస్వంత్‌నగర్ స్థానం నుంచి ఎస్పీకి చెందిన శివపాల్ యాదవ్ వర్సెస్ బీజేపీకి చెందిన వివేక్ షాక్యా, కన్నౌజ్ స్థానం నుంచి ఎస్పీకి చెందిన అనిల్ కుమార్ దోహరే వర్సెస్ బీజేపీకి చెందిన అసీమ్ అరుణ్, సిర్సాగంజ్ నుంచి బీజేపీకి చెందిన హరి ఓం యాదవ్ వర్సెస్ సర్వేశ్ సింగ్, సిర్సాగంజ్ నుంచి ఎస్పీకి బ్రిజ్ మోహన్. హత్రాస్ స్థానం నుంచి బీజేపీకి చెందిన అంజులా మహోర్ పోటీలో ఉన్నారు. మార్చి 10న జరిగే కౌంటింగ్ లో ఫలితాలు వెల్లడి కానున్నాయి.

English summary
Third phase polling in UP will be held for 59 seats in the 16 districts, total of 627 candidates in the race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X