రేప్‌లు: నిధులు తగ్గించి లగ్జరీ కార్లు కొన్న సీఎం అఖిలేష్

ఇలాంటి సమయంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం గురించిన ఓ షాకింగ్ అంశాన్ని ఆ ఆర్టీఐ కార్యకర్త బహిర్గతం చేశారు. అఖిలేష్ ప్రభుత్వం మహిళా కమిషన్‌కు నిధులకు కోత పెట్టినట్లు ఆర్టీఐ కార్యకర్త సేకరించిన సమాచారం వెల్లడించింది.
అంతేకాదు ఆ మొత్తాన్ని యూపీ ప్రభుత్వం రెండు సెవన్ సీటర్ మెర్సిడెజ్ కార్లు, రెండు లాండ్ క్రూయిజర్ కార్లు కొనేందుకు వెచ్చించిందట.
సామాజికవేత్త ఊర్వశి శర్మ సమాచార హక్కు చట్టం ద్వారా మహిళా కమిషన్‌కు కేటాయించిన నిధుల వివరాలు అడిగారు. గత మూడేళ్లుగా సమాజ్‌వాది ప్రభుతవం మహిళా కమిషన్‌కు నిధులు క్రమంగా తగ్గించినట్లుగా అందులో వెల్లడైంది. 2011-12కు గాను రూ.5.1 కోట్లు ఇవ్వగా 2013-14 సంవత్సరానికి గాను రూ.75 లక్షలు కేటాయించారట. మహిళా కమిషన్‌కు నిధులు తగ్గించడంపై మాయావతి, రేణుకా చౌదరి తదితరులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications