ముజఫర్ అల్లర్లు: సిఎం అఖిలేష్‌కు చేదు అనుభవం
లక్నో: ముజఫర్‌నగర్‌లో హింస చేలరేగిన ప్రాంతంలో పర్యటించడానికి వెళ్లిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌కు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. బాధితులు, విపక్షాల నుండి అఖిలేష్ యాదవ్‌కు తీవ్ర నిరసన ఎదురైంది.
ముజఫర్ నగర్ అల్లర్ల ఘటనలో 47 మంది వరకు చనిపోయారు. ఇక్కడి కవాల్ గ్రామంలో అఖిలేష్ పర్యటించారు. ఈ సమయంలో ఆందోళనకారులు నల్ల జెండాలతో ఆయనకు నిరసన తెలిపారు. అఖిలేష్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలేష్ కుమార్ తాము ఇచ్చిన మోమోరండాన్ని కూడా తీసుకోలేదని ఆందోళనకారులు ఆరోపించారు.

అల్లర్ల ఘటనపై అఖిలేష్ స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమైనదని, శాంతిగా ఉండాలని తాము మొదటి నుండి కోరుతున్నామని, అల్లర్లు సృష్టించే వారి పైన తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అనంతరం అఖిలేష్ అల్లర్లు జరిగిన మరికొన్ని గ్రామాల్లో పర్యటించారు.
కాగా, ఇప్పటికే ఈ అలర్లను అదుపు చేయడంలో విఫలమైన ముజఫర్‌నగర్ ఎస్ఎస్‌పీ సుభాష్ దూబేను విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం అతనిపై విచారణకు ఆదేశించింది. ఇక, అల్లర్లు జరిగిన ప్రాంతాలలో విధించిన కర్ఫ్యూను ఆదివారం 12 గంటలు సడలించారు. మరోవైపు, అల్లర్లకు వ్యతిరేకంగా నిరసనగా బాగ్‌పట్ లోక్‌సభ నియోజకవర్గం ఎస్పీ అభ్యర్థి సోమ్‌పాల్ శాస్త్రీ తన టికెట్‌ను వెనక్కి ఇచ్చేశారు.












Click it and Unblock the Notifications