వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్ సామాన్యుల సవారీ; ఉగ్రవాదులు సైకిళ్లను ఎంచుకున్నారన్న ప్రధాని మోడీకి అఖిలేష్ యాదవ్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులు సైకిల్‌ను ఎంచుకుంటున్నారు అని చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోమవారం నిప్పులు చెరిగారు. సైకిల్‌ను అవమానించడం మొత్తం దేశాన్ని అవమానించటం అని ఆయన వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి ప్రత్యుత్తరం సైకిల్‌పై హిందీలో ఒక పద్యం చెప్పారు. ఆయన తన పార్టీ ఎన్నికల గుర్తు -- "సామాన్యుల సవారీ" మరియు గ్రామాల గర్వం అని పేర్కొన్నారు.

సైకిల్ సామాన్యుల సవారీ .. అఖిలేష్ యాదవ్

సైకిల్ సామాన్యుల సవారీ .. అఖిలేష్ యాదవ్

సైకిల్ రైతులను వారి పొలాలకు చేరుస్తుంది. వారి శ్రేయస్సుకు పునాది వేస్తుంది. ఈ చక్రం మన బిడ్డలను పాఠశాలకు తీసుకువెళుతుంది. సామాజిక పరిమితులను అధిగమించింది. ఇది ద్రవ్యోల్బణం తాకకుండా ముందుకు సాగుతుంది. సైకిల్ సామాన్యుల రైడ్, గ్రామీణ భారతదేశం యొక్క గర్వం అని పేర్కొన్నారు. సైకిల్‌ను అవమానించడం యావత్ దేశానికే అవమానం అని సైకిల్‌పై ప్రయాణిస్తున్న పాఠశాల విద్యార్థి, ఒక బొమ్మ విమానాన్ని చూసి నవ్వుతున్నట్టు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.

సమాజ్ వాదీ పార్టీ సైకిల్ ను టార్గెట్ చేసి ఉగ్రవాద వ్యాఖ్యలు చేసిన మోడీ

సమాజ్ వాదీ పార్టీ సైకిల్ ను టార్గెట్ చేసి ఉగ్రవాద వ్యాఖ్యలు చేసిన మోడీ

2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో శుక్రవారం నాడు 49 మంది దోషులుగా తేలిన సందర్భంలో, సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తును ఉగ్రవాదులతో ముడిపెట్టి నిన్న ప్రధాని మోదీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులపై ఉదారంగా వ్యవహరించారని, పేలుళ్లను రెండు రకాలుగా అమలు చేశారు.

మొదటిది నగరంలో 50-60 ప్రదేశాలలో పేలుడుకు ప్లాన్ చేశారని, ఆపై రెండు గంటల తర్వాత, పేలుడు జరిగింది. ఆసుపత్రిలో ఒక వాహనంలో పేలుడు జరిగిందని పేర్కొన్నారు. అధికారులు, నాయకులు, సామాన్య ప్రజలు ఎందరో అక్కడికి వెళతారని, అక్కడ చాలా మంది మరణించారని హర్దోయ్‌లో జరిగిన బహిరంగ సభలో పిఎం మోడీ అన్నారు.

పేలుళ్లకు ఉగ్రవాదులు సైకిల్స్ వాడారన్న మోడీ

పేలుళ్లకు ఉగ్రవాదులు సైకిల్స్ వాడారన్న మోడీ

ప్రారంభ పేలుళ్లలో, బాంబులను సైకిళ్లపై ఉంచారు.ఉగ్రవాదులు సైకిళ్లను ఎందుకు ఎంచుకున్నారని తాను ఆశ్చర్యపోయానని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 2006 (వారణాసి), అయోధ్య మరియు లక్నో (2007) పేలుళ్లలో నిందితులపై కేసులను సమాజ్‌వాదీ పార్టీ ఉపసంహరించుకుందని ఆయన ఆరోపించారు. యుపిలో ఉగ్రదాడులకు సంబంధించి 14 కేసుల్లో, చాలా మంది ఉగ్రవాదులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని సమాజ్‌వాదీ ప్రభుత్వం ఆదేశించింది.

Recommended Video

UP Elections 2022 : First Phase Polling Completed,Polling Percentage Is ? | Oneindia Telugu
ఉగ్రవాదుల దాడుల వెనుక ఎస్పీ ఉందన్న మోడీ.. బదులిచ్చిన అఖిలేష్ యాదవ్

ఉగ్రవాదుల దాడుల వెనుక ఎస్పీ ఉందన్న మోడీ.. బదులిచ్చిన అఖిలేష్ యాదవ్

ఉగ్రవాదులు బాంబు పేలుళ్ళ వెనుక సమాజ్ వాదీ పార్టీ ఉందని ఈ వ్యక్తులు పేలుళ్లకు పాల్పడుతున్నారని వెల్లడించారు. సమాజ్‌వాదీ ప్రభుత్వం ఉగ్రవాదులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించలేదు అంటే అర్థం ఏమిటో అందరికీ అర్థమైందని మోడీ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో రౌండ్‌ ఎన్నికలు కూడా ముగిశాయి. మూడో దశ ఎన్నికల రోజున ప్రధానమంత్రి తన ప్రచారంలో అఖిలేష్ యాదవ్ యొక్క సమాజ్ వాదీ పార్టీ ని టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే అఖిలేష్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీకి ధీటుగా సమాధానమిచ్చారు.

English summary
Samajwadi Party chief Akhilesh Yadav has lashed out at the BJP. Akhilesh Yadav counters Prime Minister Modi comments over bomb blasts linking to SP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X