వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కమ్మ చెరియన్: "నేనే నాయకురాలిని. మిగిలిన వాళ్లను చంపే ముందు నన్ను చంపండి’’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అక్కమ్మ చెరియన్

స్వాతంత్య్ర పోరాటంలో ఒక భారీ ర్యాలీ జరుగుతున్న సమయంలో ప్రదర్శించిన ధైర్యానికి కేరళకు చెందిన అక్కమ్మ చెరియన్ పేరు సంపాదించారు.

స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ట్రావన్‌కోర్ రాష్ట్రంలో జరిగిన ఈ నిరసనను చాలా కీలకమైనదిగా చరిత్రకారులు భావిస్తారు.

"15 ఏళ్లకు పైగా ఆమె ట్రావన్‌కోర్ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. స్వాతంత్రానికి ముందు ట్రావన్‌కోర్‌లో ప్రజా పోరాటాన్ని ముందుండి నడిపించారు" అని దిల్లీకి చెందిన సోషల్ సైంటిస్ట్ కందాథిల్ సెబాస్టియన్ రాశారు.

చెరియన్ 1909లో సంపన్న వ్యవసాయ కుటుంబంలో ట్రావన్‌కోర్‌లో జన్మించారు. ఆమె చరిత్ర చదువుకుని టీచర్ అయ్యారు. ఎడక్కర పట్టణంలో ఒక స్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలు అయ్యారు.

మహాత్మా గాంధీ స్ఫూర్తితో భారత స్వాతంత్య్రం కోసం పోరాడేందుకు 1938లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ట్రావన్ కోర్ రాష్ట్ర కాంగ్రెస్ లో చేరారు.

"ఈ ప్రపంచమే ఒక నాటకరంగం, అందులో ఉన్న స్త్రీ పురుషులందరూ కేవలం నటులు అని షేక్‌స్పియర్ చెప్పారు. కానీ, నాకు మాత్రం ఈ జీవితం ఒక సుదీర్ఘ పోరాటం" అని చెరియన్ తన ఆత్మకథ "జీవితం ఒక పోరాటం" లో రాసుకున్నారు. ఈ పుస్తకంలో ఆమె "సంప్రదాయవాదం, అర్థరహితమైన ఆచారాలు, సామాజిక అన్యాయం, లింగ వివక్ష, అసత్యానికి, అన్యాయాన్ని నిరసించాలి" అని రాశారు.

"ఇలాంటివి చూసినప్పుడు నా కళ్లు మసకబారుతాయి. నన్ను నేను మర్చిపోతాను".

చెరియన్ స్వాతంత్య్ర పోరాటంలో చేరిన కొన్ని రోజులకే బ్రిటిష్ ప్రభుత్వం ట్రావన్‌కోర్ రాష్ట్ర కాంగ్రెస్‌‌కు చట్టబద్ధత లేదని ప్రకటించింది.

చెరియన్ గాంధీ, నెహ్రు లాంటి నాయకులను చూసి స్ఫూర్తి పొందారు.

పార్టీ నాయకులు చాలా మంది జైలులోకి వెళ్ళగానే ట్రావన్‌కోర్ 11వ అధ్యక్షుడు కుట్టనాడ్ రామకృష్ణ పిళ్ళై అరెస్టు కావడానికి ముందు పార్టీకి నేతృత్వం వహించే బాధ్యతను చెరియన్‌కు అప్పగించారు.

"ఈ బాధ్యతను చేపట్టడంలో ఉన్న తీవ్రత దీని వల్ల కలిగే పరిణామాల గురించి నాకు బాగా తెలుసు. కానీ, ఈ పని చేసేందుకు ముందుకొచ్చాను" అని ఆమె ఆత్మకథలో రాసుకున్నారు.

భారీ నిరసన ర్యాలీల్లో పాల్గొనేందుకు ప్రజలను సమీకరించేందుకు ఆమె నేతృత్వంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ట్రావన్ కోర్ రాజు పుట్టిన రోజు వేడుకలకు భంగం కలిగించేందుకు 1938 అక్టోబరు 23 న చెరియన్, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి వేలాది మంది నిరసనకారులు రాజ భవనం ముందు గుమిగూడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పై విధించిన నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

"ఓపెన్ జీప్ పై నిల్చుని ఖద్దరు దుస్తులు, గాంధీ టోపీ ధరించి జరుగుతున్న అన్యాయాన్ని, దుర్మార్గాన్ని తన పాదాల కింద వేసి తొక్కేస్తున్న దుర్గా మాత మాదిరిగా ఆమె కనిపించారు ఆమె కురులు నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎగిరిన నల్ల జెండాల మాదిరిగా గాలిలోకి ఎగిరింది" అని ఈ ఎమ్ కోవూర్ అనే రచయత వర్ణించారు.

రాజ భవనం ముందు నిల్చున్న పోలీసు అధికారి వేలాది మంది నిరసనకారులను కాల్చేయమని ఆదేశాలు జారీ చేశారు. "నేనే నాయకురాలిని. మిగిలిన వాళ్ళను చంపే ముందు నన్ను చంపండి" అని చెరియన్ ఆయనకు చెప్పారు.

ఆమె మాటలు పోలీసు అధికారిని ఆయన ఆదేశాలు వెనక్కి తీసుకునేటట్లు చేశాయి.

ప్రభుత్వం జైలులో ఉన్న నిరసనకారులందరినీ విడుదల చేసేవరకు నిరసనలు కొనసాగాయి.

ట్రావన్‌కోర్ ఝాన్సీ రాణి

ఈ సంఘటన గురించి విన్న మహాత్మా గాంధీ చెరియన్ ను ట్రావన్‌కోర్ ఝాన్సీ రాణి అని అభివర్ణించారు. ఝాన్సీ రాణి

లక్ష్మీ బాయ్ 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడారు.

1938లోనే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చెరియన్ మహిళా వాలంటీర్ల కోసం దేశ సేవిక సంఘ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించి మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడాన్ని ప్రోత్సహించారు.

చెరియన్ సోదరి రోశమ్మ పున్నూజ్, సోదరుడు కేసి వర్కే కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు.

రాష్ట్ర కాంగ్రెస్ తొలి వార్షిక సమావేశంలో పాల్గొన్నందుకు చెరియన్, పున్నూజ్‌తో పాటు చాలా మంది కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు.

ఆ తర్వాత సంవత్సరాల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి, నిరసనల్లో పాల్గొన్నందుకు చెరియన్‌ను చాలా సార్లు అరెస్టు చేశారు.

1942లో ఆమె రాష్ట్ర కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షునిగా నియమితులయ్యారు. బాంబే (ప్రస్తుత ముంబయి) లో భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆమె స్వాగతించారు.

ఈ తీర్మానం బ్రిటిష్ పాలన నుంచి పూర్తి స్వాతంత్రాన్ని కావాలని పిలుపునిచ్చింది. ఇది దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం కోసం అతి పెద్ద స్థాయిలో జరిగిన అహింసాయుత పోరాటానికి నాంది పలికింది.

1942లో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది.

స్వాతంత్య్రం తర్వాత చెరియన్ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు మార్గం ఏర్పరుచుకున్నారు. 1947లో జరిగిన ఎన్నికల్లో ట్రావన్‌కోర్ శాసన సభకు ఎన్నికయ్యారు.

1950లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు సీటు లభించకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు.

"ట్రావన్‌కోర్‌లో మహిళలు ఇప్పటికే ఇంట్లోనే మహారాణులు అని రాజకీయాలు వారికి సంబంధించినవి కావు" అని అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వ్యాఖ్యానించారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో ముందుండి నడిపించిన తన లాంటి చాలా మంది మహిళలను పార్టీ పక్కకు నెట్టేసిందని చెరియన్ తన ఆత్మకథలో రాసుకున్నారు.

చెరియన్ తన తోటి స్వాతంత్య్ర ఉద్యమకారులు, పార్టీ కార్యకర్త వీవీ వర్కే మన్నంప్లాకల్ ను పెళ్లి చేసుకున్నారు.

"నేను వాళ్లను కలిసేందుకు వెళ్లే సమయానికి వారొక చిన్న ఇంట్లో ఉండేవారు. ఆ ఇంట్లో సామాన్ల కంటే కూడా పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె హుందాతనం, వర్కే మృదు స్వభావం నాకు గుర్తున్నాయి. వారు రాజకీయాల నుంచి ఎందుకు వైదొలిగారో స్పష్టంగా అర్ధమయింది" అని 2007లో పాల్ జకారియా అనే రచయత పేర్కొన్నారు.

రాష్ట్రంలో తొలి తరం ఫెమినిస్ట్‌లలో చెరియన్ ఒకరని చరిత్రకారులు జే.దేవిక అన్నారు.

చెరియన్ 1982లో తిరువనంతపురంలో మరణించారు. ఆమె జ్ఞాపకార్ధం ఆమె పేరు మీద ఉన్న పార్కులో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Akkamma Cherian: "I am the leader. Kill me before you kill the rest."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X