వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్ బదర్ చీఫ్ గ్వానీ ఖ్వాజా హతం.. గొప్ప విజయం అని ఐజీపీ కామెంట్

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాద సంస్థ అల్ బదర్ చీఫ్ గ్యానీ ఖ్వాజాను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోపోర్‌లోని తుజ్జార్ గ్రామంలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇదీ భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. తుజ్జార్ గ్రామంలో ఇద్దరు ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఆర్మీ బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.

 Al Badr chief Ganie Khwaja killed in encounter in Sopore

భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. ఫైరింగ్ ప్రారంభమైన వెంటనే పోలీసులు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతడిని అల్ బదర్ చీఫ్ గ్యాన్ ఖ్వాజాగా గుర్తించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలోసెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.

ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అల్ బదర్ మృతితో భద్రతా బలగాలు మరో ముందడుగు వేశారు. కశ్మీర్‌లో వేర్పాటువాదుల ఉనికి లేకుండా చేసేందుకు ఇదీ దోహదం చేస్తుందని వారు అంటున్నారు.

English summary
security forces have gunned down Al Badr chief Ganie Khwaja in an encounter in Tujjar village of Sopore in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X