Employees: ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్న ఉద్యోగులకు అలర్ట్.. వెంటనే ఇలా చేసుకోండి!

Employees: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ అత్యవసరంగా మారింది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లినా డిజిటల్ పేమెంట్స్ మాత్రమే ఎక్కువగా జరగుతున్నాయి. దీని కోసం బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా మారింది. మరో వైపు లోన్లు పొందడానికి, ఉద్యోగుల జీతాలు పొందడానికి, కొన్ని రకాల ప్రభుత్వ పథకాలు పొందడానికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ఈ రోజుల్లో ఉద్యోగులు చాలా మంది ఎక్కువ బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే వారికి మల్టీపుల్ బ్యాంకు అకౌంట్లు ఉండడం సహజమే. ఎందుకంటే కంపెనీ మారినప్పుడల్లా కొత్త కంపెనీ వారి టై-అప్ బ్యాంక్ తో జీతాలకు సంబంధించిన అకౌంట్లను క్రియేట్ చేస్తుంది.

లేదంటే చార్జీల మోతే..
ఈ క్రమంలో ఓ ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను కలిగి ఉండడం సాధారణమే. కొందరి పేరు మీదు నాలుగు నుంచి ఐదు అకౌంట్లు కూడా ఉంటాయి. అయితే అన్ని బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. దీంతో చాలా మంది కొన్ని బ్యాంకు అకౌంట్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అకౌంట్లకు సంబంధించి చార్జీలు పెరిగినట్లు మెసేజ్ లు వస్తూ ఉంటాయి. దగ్గర ఉన్న అన్ని అకౌంట్లలో మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లేదంటే బ్యాంకులు నాన్-మెయింటెనెన్స్ ఛార్జీలు విధిస్తాయి.

Alert for Employee with Multiple Bank Accounts Here s What You Should Do Now

మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే..
సాధారణంగా సాలరీ అకౌంట్ కు మినిమం బ్యాలెన్స్ లేకుండా అంటే జీరో అకౌంట్ అయితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అంటే సాలరీ పడిన తర్వాత మొత్తం తీసేసినా ఎలాంటి రుసుమును వసూలు చేయరు. కానీ ఈ బ్యాంక్ అకౌంట్ ను మూడు నెలల పాటు వాడకపోయినా లేదా ఇందులో మూడు నెలల పాటు జీతం పడకపోయినా ఆ అకౌంట్ సేవింగ్ అకౌంట్ కు మారిపోతింది. సేవింగ్ అకౌంట్ కు మారిపోయిన అనంతరం ఆ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీలను వేస్తారు. ఇలాంటి అకౌంట్లలో కార్పొరేట్ బ్యాంకు ఖాతాలు అయితే కచ్చితంగగా మినిమం బ్యాలెన్స్ రూ.10,000 ఉండాలి. ఈ మొత్తం లేకపోతే ప్రతి నెలా ఛార్జీలను విధిస్తారు. ఇలాంటి అకౌంట్లపై ఏటీఎం కార్డు ఉంటే వాటికి కూడా చార్జీలు విధిస్తారు.

ఇలా చేయడం మంచిది..
ఇలాంటి చార్జీల నుంచి తప్పించుకోవాలంటే ఉద్యోగులు సంస్థ మారినప్పుడల్లా పాత బ్యాంక్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకోవడం చాలా మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ చార్జీలు చెల్లించకపోతే ఆ ప్రభావం సిబిల్ స్కోరుపై పడుతుంది. సిబిల్ స్కోరు తగ్గితే భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. అందుకే ఎక్కువ అకౌంట్లు కలిగినవారు వెంటనే వాటిని క్లోజ్ చేసుకోవడం మంచిది. ఉద్యోగులు లేదా ప్రజలు తమ బ్యాంకు ఖాతాల సంఖ్యను గరిష్ఠంగా 2 లేదా 3కి పరిమితం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు ఎక్కువ అకౌంట్లను మేనేజ్ చేయడం కష్టం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+