రూల్ మారింది: ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు 35 సెకన్లు
న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకోవాలంటే 35 సెకన్లు ఆగాల్సిందేనని సంస్ధ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏకే మనోచా తెలిపారు. కొంత మంది దళారులు ఆటోమేటిక్ సాప్ట్‌వేర్ల ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారని, ఇలా చేయడం ద్వారా అసలు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.
ఆన్‌లైన్ బుకింగ్‌లో అవకతవకలను నివారించడంతో పాటు అసలైన టికెట్ దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతేకాదు వెబ్‌సైట్ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇకపై ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు 35 సెకన్లు ఆగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల వివరాల నమోదుకు 25 సెకన్లు, బ్యాంకు లావాదేవీకి 10 సెకన్లు అవసరమని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో నిమిషానికి 15,000 టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించామన్నారు.

ప్రతి రెండు రైల్వే డివిజన్లలో ఒక టికెట్ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోందని చెప్పిన ఆయన ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా 1.5 లక్షల తత్కాల్ టిక్కెట్లను అందుబాటులోకి ఉంచామన్నారు. వీటిలో తొలి 35 సెకన్లలో బుక్ అయ్యే టిక్కెట్లు 5 నుంచి 6 వేల వరకు మాత్రమే అని వివరించారు.
మొత్తం భారతీయ రైల్వేల్లో బుక్ అవుతున్న టిక్కెట్లతో పోల్చితే 58 శాతం టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హ్యాకింగ్ గురయ్యే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications