బీజేపీ ఎంపీలందరినీ అప్రమత్తం చేసిన హైకమాండ్
Mock drill: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
ఫలితంగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. త్రివిధ దళాలు పూర్తిగా యాక్టివేట్ అయ్యాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నాయి.

అదే సమయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చింది. బుధవారం తొలి విడత సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరుగనుంది. యుద్ధం వస్తే దీన్ని ఎలా ఎదుర్కొవాల్సి ఉంటుందనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించాల్సి ఉంటుంది ఆయా రాష్ట్రాలకు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 244 జిల్లాల్లో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఉంటుంది.
సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, హోమ్ గార్డులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లు, వలంటీర్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సభ్యులు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. సాధారణంగా మాక్ డ్రిల్ అనేది అగ్నిప్రమాదాలు, భూకంపాలు, మెడికల్ ఎమర్జెన్సీ, రైల్వే స్టేషన్లపై ఉగ్రవాద దాడులు చోటు చేసుకున్నప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను ఎలా రక్షించాలనే విషయంపై ఓ ఎక్సర్‌సైజ్‌లాంటిది.
యుద్ధమే నిర్వహించాల్సి వస్తే- పౌర రక్షణ యంత్రాంగం సంసిద్ధతను అంచనా వేయడానికి, దాని సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి గ్రామ స్థాయి వరకు ప్రజలను ఎలా కాపాడుకోవాల్సి ఉంటుందనే విషయంపై ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. పాకిస్తాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది.
ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక ఆదేశాలను జారీ చేసింది. మాక్ డ్రిల్ జరిగే 244 జిల్లాల పరిధిలో ఉన్న పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఇందులో పాల్గొనాలని సూచించింది. మాక్ డ్రిల్ నిర్వహించబోయే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పారా మిలటరీ బలగాలు, సీఆర్పీఎఫ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీసులకు సహకరించాలని కోరింది.
ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఓ ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది. మాక్ డ్రిల్ సన్నాహకాలో పాల్గొనే సాధారణ పౌరులకు తమవంతు సహాయ సహకారాలను అందించాలని సూచించింది. అవసరమైతే వారికి మంచినీరు, రవాణా వసతిని కల్పించాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications