మోదీజీ సమరశంఖం పూరించు.. యుద్ధానికి కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్..: రాహుల్ గాంధీ
జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశంలోని అన్ని పార్టీలు ఏకమయ్యాయి. తాజాగా జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు పహల్గాం ఉగ్రదాడిని దేశంలోని అన్ని పార్టీలు తప్పుబట్టాయి. ఇది పిరికిపంద చర్య, హేయమైన చర్యగా అభివర్ణించాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాలని అఖిలపక్ష సమావేశంలో తీర్మానించాయి. జమ్ము కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే తెలిపారు.
మరోవైపు జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సమాయత్తం అవుతోంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన, వెనక ఉండి సహకారం అందించిన అందర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని.. ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని హెచ్చరికలు జారీ చేశారు.

ఇక ప్రధాని మోదీ వ్యాఖ్యలతో అటు పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఇప్పటికే సరిహద్దుకు బలగాలను మోహరించింది. క్షిపణి పరీక్షలు జరిపింది. ఇప్పటికే పాకిస్థాన్ సైనికులకు సెలవులను రద్దు చేసింది. దీంతో జమ్ము కాశ్మీర్ సరిహద్దులో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. మరో రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications