సెక్యులరిస్ట్‌లు హిందుత్వాన్నే టార్గెట్ చేస్తారేం: తస్లీమా
తిరువనంతపురం: లౌకికవాదులుగా చెప్పుకునే వారు కేవలం హిందుత్వాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీని శనివారం నాడు ప్రశ్నించారు. భారత దేశంలో ఎలాంటి అసహనం లేదని ఆమె పునరుద్ఘాటించారు.
ఆమె కేరళలోని కోజికోడ్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివెల్లో మాట్లాడారు. భారత దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇతర మతాలను గౌరవిస్తారని, సహనంతో ఉండారని, భారత దేశంలోని చట్టాలు అసహనంను సహించవని చెప్పారు. అయితే, దేశంలో అసహనం కలిగిన వారు చాలామంది ఉన్నారన్నారు.

అదే సమయంలో ఆమె మాట్లాడుతూ... లౌకికవాదులుగా చెప్పుకునే వారు కేవలం హిందూ మతవాదులను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని ప్రశ్నించారు. వారు ఇస్లామిక్ మతవాదులను లక్ష్యంగా చేసుకోరని, ఇది సూడో సెక్యులరిజమని ఎద్దేవా చేశారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ... ఏ ఒక్క మతం కూడా మహిళకు అనుకూలంగా లేదని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని మతాలు కూడా మహిళా వ్యతిరేకంగానే ముందుకు సాగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. తస్లీమా నస్రీన్‌కు భార దేశం ఆశ్రయం ఇచ్చింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications