మసీదులో హిందువుల పూజలపై హైకోర్టు కీలక నిర్ణయం
Gyanvapi Mosque: చారిత్రాత్మకమైన వారణాశిలో గల జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారంలో ప్రతివాదులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వారణాశిలోని ఈ మసీదులో పూజలను నిర్వహించడానికి హిందువులకు ఇచ్చిన అనుమతిని నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.
జ్ఞాన్‌వాపి మసీదు దక్షిణ భాగం సెల్లార్‌లో గల వ్యాస్ కా ఠికానాలో రోజువారీ పూజాదికాలను నిర్వహించుకోవడానికి అవరమైన అనుమతులు ఇదివరకే హిందువులకు లభించిన విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, సుహృద్భావ వాతావరణంలో పూజలు జరుపుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లను చేసింది.

ఈ మేరకు బుధవారమే వారణాశి కోర్టు.. అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఏడు రోజుల గడువు ఉన్నప్పటికీ.. ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే మసీదులో పూజలు మొదలయ్యాయి. గురువారం మసీదు బేస్‌మెంట్‌లో హిందు సంప్రదాయాల ప్రకారం.. పూజాదికాలు జరిగాయి. అర్చకులు మహా శివుడికి పూజలు చేశారు. ఘంటానాదాన్ని వినిపించారు. వేదమంత్రోచ్ఛారణలను జపించారు.
వారణాశి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్ వెళ్లింది జ్ఞాన్‌వాపి మసీదుకు చెందిన అంజుమన్ ఇంతెజామియా కమిటీ. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. మధ్యంతర స్టే ఇవ్వాలంటూ పిటీషన్‌ను దాఖలు చేసింది. ఏడు రోజుల సమయం ఉన్నప్పటికీ.. వెంటనే పూజలను మొదలుపెట్టడం సరికాదని అభిప్రాయపడింది.
ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు.. తన తుది ఆదేశాలను కొద్దిసేపటి కిందటే వెలువడించింది. మధ్యంతర స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ సారథ్యంలేని బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications