షాక్: జాతీయ గీతాన్ని నిషేధించిన స్కూల్, ప్రిన్సిపాల్, టీచర్ల రాజీనామా
అలహాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం వేడుక అంటే ఏ పాఠశాలలోనైనా ఘనంగా జరిపేందుకు వారం ముందు నుంచే ప్రణాళికలు వేసుకుంటారు. అయితే ఈ పాఠశాల యాజమాన్యం మాత్రం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసే నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు విద్యార్థులు జాతీయగీతాన్ని ఆలపించొద్దని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌కు చెందిన ఓ పాఠశాల మేనేజర్ ఆదేశాలు జారీ చేశాడు.
అలహాబాద్ నగరంలోని బఘారాలో ఉన్న జియా-ఉల్-హక్ పాఠశాలలో జాతీయ గీతంతో పాటు వందేమాతరం, సరస్వతి వందనాలను కూడా స్కూల్ మేనేజర్ నిషేధించాడు. జాతీయ గీతం మతానికి వ్యతిరేకంగా ఉందని.. దాన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాడించకూడదని మేనేజర్ ఆదేశాలు జారీ చేశాడు.
బఘారాలోని స్కూల్లో 330 విద్యార్థులు, 20 మంది టీచర్లు పనిచేస్తుండగా.. శుక్రవారం మేనేజర్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రిన్సిపాల్ తోపాటు 8మంది ఉపాధ్యాయులు రాజీనామా చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవం తేదీ దగ్గరపడుతుండటంతో పాఠశాలలో సంబరాలకు ఏర్పాట్లుపూర్తి చేసి మేనేజర్‌కు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ రీతూ శుక్లా చెప్పారు. కాగా, వాటిని పరిశీలించిన మేనేజర్ వందేమాతరం, సరస్వతి వందనం, జాతీయ గీతాల్లోని పదాలు ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిపారు. విద్యార్థులతో వీటిని పాడించడానికి వీల్లేదని చెప్పినట్లు వివరించారు. దీనిని వ్యతిరేకించిన వాళ్లందరూ స్కూల్ నుంచి వెళ్లిపోవచ్చని చెప్పినట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఎనిమిది టీచర్లు రాజీనామా చేశారని చెప్పారు. జాతీయ గీతంలోని 'భారత భాగ్య విధాత' అనే వరుసలో భారతదేశం దైవం కాదని, అల్లానే దైవమని మేనేజర్ వ్యాఖ్యనించినట్లు వివరించారు. జాతీయగీతాన్ని ఆలపించొద్దని విద్యార్థులు, టీచర్లను అడ్డగించే హక్కు ఎవరికీ లేదని.. జియా-ఉల్-హక్ స్కూల్ మేనేజర్‌ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ స్పష్టం చేశారు. కాగా, స్కూల్ మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications