Alt News: జుబైర్ కు సుప్రీం కోర్టులో షరతులతో బెయిల్, అయినా జైల్లోనే, ఆ కేసుకు మాత్రమే, అసలు ఏం జరిగింది !
న్యూఢిల్లీ/లక్నో/ బెంగళూరు: ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ అల్టో న్యూస్ సహ వ్యవస్థాపకుడు మోహమ్మద్ జుబైర్ కు సుప్రీం కోర్టులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. అయితే సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు అయినా మోహమ్మద్ జుబైర్ జైల్లోనే ఉండవలసి వస్తోంది. మరో కేసులో మహమ్మద్ జుబైర్ కు బెయిల్ మంజూరు కాకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైయ్యింది. మతఘర్షణలు జరిగేలా, ప్రజలను రెచ్చగొట్టేలా మోహమ్మద్ జుబైర్ ట్వీట్ చేశాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈయన మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికే మోహమ్మద్ జుబైర్ మీద ఢిల్లీలో మరో కేసు నమోదు కావడంతో ఆ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు.

ఆల్ట్ న్యూస్ జుబైర్ అరెస్టు
మతఘర్షణలు జరిగేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ సహ వ్యవస్థాపకుడు మోహమ్మద్ జుబైర్ ట్వీట్ చేశాడని ఉత్తరప్రదేశ్ లోని సీతాపుర పోలీస్ స్టేషన్ లో సీతాపుర జిల్లా హిందూ షేర్ సేనా అధ్యక్షుడు భగవాన్ శరణ్ కేసు పెట్టారు. సీతాపుర పోలీసులు మోహమ్మద్ జుబైర్ మీద మీద కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేశారు.

సుప్రీం కోర్టులో బెయిల్
మోహమ్మద్ జుబైర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేశారు. బెయిల్ మంజూరు చెయ్యడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించడంతో మోహమ్మద్ జుబైద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం మోహమ్మద్ జుబైద్ కు ఐదు రోజుల పాటు మధ్యంతర జామీను మంజూరు చేసి ఉత్తరప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

బెయిల్ ఈ కేసుకు మాత్రమే
సీతాపుర కేసుకు సంబంధించి మాత్రమే మేము మోహమ్మద్ జుబైదార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని, మరే కేసులకు, ఎఫ్ఐఆర్ లకు ఈ బెయిల్ షరతులు వర్తించవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బెంగళూరు, లేదా మరెక్కడ కూడా మోహమ్మద్ జుబైదార్ ట్వీట్ లు తారుమారు చెయ్యకూడదని, సాక్షాలు నాశనం చెయ్యడానికి ప్రయత్నించకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో మరో కేసు నమోదు
మోహమ్మద్ జుబైర్ కు బెయిల్ మంజూరు చెయ్యకూడదని, కేసు విచారణ సోమవారం నాటికి వాయిదా వెయ్యాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం మోహమ్మద్ జుబైర్ కు మధ్యంతర జామీను మంజారు చేసింది. అయితే ఢిల్లీలో కూడా మోహమ్మద్ జుబైర్ మీద కేసు నమోదు కావడంతో అతను జైలు నుంచి విడుదల కావడానికి అవకాశం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications