నడుస్తున్న రైలులో.. ఏసీ కోచ్‌లో.. వివాహిత దారుణ హత్య
జైపూర్ : ఇండోర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. ఓ వివాహితను దుండగులు హత్యం చేయడం కలకలం రేపింది. ఆళ్వార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సదరు ట్రైన్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకుని పాశవికంగా హత్య చేశారు.
ఆళ్వార్‌కు చెందిన అంజు, భర్త జితేంద్ర యాదవ్, రెండేళ్ల కుమారుడితో కలిసి ఆదివారం రాత్రి ఇండోర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఆమె తన కుమారుడితో కలిసి 25వ బెర్త్ పైన నిద్రించగా.. జితేంద్ర 28వ బెర్త్‌పైన నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి దాటాక 2 నుంచి 3 గంటల సమయంలో కుమారుడి ఏడుపు విని నిద్రలేచిన జితేంద్ర షా కు భార్య కనిపించలేదు. దాంతో వాష్‌రూమ్‌లో ఉందేమోనన్న అనుమానంతో అక్కడికి వెళ్లి చూడగా షాక్ తిన్నాడు.

బాత్రూమ్‌లో అంజు శవమై కనిపించింది. దుప్పటితో ఆమెకు ఉరి బిగించి ఉన్నట్లు గుర్తించాడు. దాంతో వెంటనే చైన్‌లాగి రైలుని ఆపాడు. రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆ రైలు దగ్గరకు చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని మొదటగా చిత్తోర్‌ఘర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం అక్కడి నుంచి సమీప ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
దొంగలు ఆమె ఒంటిపై ఉన్న నగల్ని దోచుకున్న తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంపై గాయాలున్నట్లు కూడా గుర్తించారు. ఆ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications