దేశ ప్రజలే మా మొదటి ప్రాధాన్యత: ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై ప్రధాని మోడీ స్పందన

న్యూఢిల్లీ: దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, వారి కోసమే తమ నిర్ణయాలుంటాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

'ప్రజలే మా మొదటి ప్రాధాన్యత. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు.. ముఖ్యంగా పెట్రో ధరల తగ్గింపు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది. ప్రజల జీవితాన్ని సులభతరం (ఈజ్ ఆఫ్ లివింగ్) చేస్తుంది' అని మోడీ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. కేంద్రం తాజాగా పెట్రో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది.

 Always People First’: PM Modi Lauds FMs Decision To Slash Excise Duty On Petrol, Diesel

లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గితే, డీజిల్ ధర రూ.7 వరకు తగ్గింది. మరోవైపు, వంటగ్యాస్ ధరనూ తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్ కు రూ. 200 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఏడాదికి 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తించనుంది.

పీఎం ఉజ్వల యోజన కింద రూ. 200 సబ్సిడీని అందజేస్తామన్న ప్రకటనపై కూడా ప్రధాని మోడీ స్పందించారు. ఈ పథకం కోట్లాది మంది భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు సహాయం చేస్తోందన్నారు. "ఉజ్వల సబ్సిడీపై నేటి నిర్ణయం కుటుంబ బడ్జెట్‌లను చాలా సులభతరం చేస్తుంది," అని మోడీ చెప్పారు. కాగా, ఐరన్, స్టీల్, సిమెంట్ పై సుంకాలను కూడా కేంద్రం తగ్గించింది. దీంతో వాటి ధరలు కూడా తగ్గనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+