Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్యసభలో అడుగు పెట్టటానికి నాకు అర్హత లేదా? కాంగ్రెస్ అధిష్టానంపై నగ్మా అసంతృప్తి

కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ టికెట్ల ఎంపిక కార్యక్రమం కొత్త వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన ఒక రోజు తర్వాత, నటి, రాజకీయ నాయకురాలు నగ్మా సోమవారం తనకు రాజ్యసభ అభ్యర్థిత్వం లభించకపోవడం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తనకు రాజ్యసభకు వెళ్ళే అర్హత లేదా: నగ్మా ప్రశ్న

తనకు రాజ్యసభకు వెళ్ళే అర్హత లేదా: నగ్మా ప్రశ్న

రాజ్యసభలో అడుగుపెట్టడానికి తనకు అర్హత లేదా అంటూ నగ్మా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ట్విటర్‌లో నగ్మా ట్వీట్ ఇలా ఉంది, "మా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, 2003-04లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తనకు రాజ్యసభలో అవకాశం ఇస్తానని, వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారని, కానీ అప్పుడు తాము అధికారంలో లేము అని పేర్కొన్నారు. అప్పటి నుండి ఇప్పటికీ 18 సంవత్సరాలు. వారికి తనకు రాజ్యసభ అభ్యర్థిత్వం ఇవ్వడానికి అవకాశం దొరకలేదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ జాబితాలో పేరు లేకపోవటంతో కాంగ్రెస్ నేతల అసంతృప్తి

కాంగ్రెస్ జాబితాలో పేరు లేకపోవటంతో కాంగ్రెస్ నేతల అసంతృప్తి

మహారాష్ట్ర నుండి ఇమ్రాన్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అంటే రాజ్యసభలో అడుగుపెట్టడానికి తనకు అర్హత లేదా అంటూ నగ్మా ప్రశ్నించారు. ఇమ్రాన్ ముందు మా 18 సంవత్సరాల తపస్సు కూడా తక్కువనా అని ఆమె ప్రశ్నాస్త్రాలు సంధించారు. జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఏడు రాష్ట్రాల నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. జాబితాలో పలువురు ప్రముఖ నేతల పేర్లు లేకపోవడంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థులపై కాంగ్రెస్ లో అసమ్మతి

రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థులపై కాంగ్రెస్ లో అసమ్మతి

రాజస్థాన్ నుంచి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ అభ్యర్థులుగా నిలిచారు. ఈ ముగ్గురు నేతలు రాజస్థాన్‌కు చెందిన వారు కాదు.రాజస్థాన్‌లోని సిరోహికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సన్యామ్ లోధా రాజస్థాన్ నుండి ఎవరినీ ఎందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించారు. రాజస్థాన్‌కు చెందిన ఏ కాంగ్రెస్‌ నేతను రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిగా చేయకపోవడానికి కారణం ఏమిటో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌కు చెందిన పవన్ ఖేడా కాంగ్రెస్‌లో రాజ్యసభ ఆశావహులలో ఉన్నారు . కానీ అతని పేరు కూడా జాబితాలో లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

సీనియర్లకు కాకుండా ఊహించని వారికి కాంగ్రెస్ రాజ్యసభ టికెట్లు

సీనియర్లకు కాకుండా ఊహించని వారికి కాంగ్రెస్ రాజ్యసభ టికెట్లు

అనుభవజ్ఞులైన గులాం నబీ ఆజాద్ మరియు ఆనంద్ శర్మలకు చోటు కల్పిస్తారనే ఊహాగానాలకు విరుద్ధంగా, రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆదివారం ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి మరియు రంజీత్ రంజన్ వంటి అభ్యర్థులను ఎంచుకుంది. పార్టీ మైనారిటీ విభాగం చైర్‌పర్సన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కవి ప్రతాప్‌గర్హిని మహారాష్ట్ర నుంచి పోటీకి దింపారు.కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక నుంచి రాజీవ్ శుక్లా, అజయ్ మాకెన్, జైరాం రమేష్‌లను బరిలోకి దింపింది.

 18 ఏళ్లుగా తనకు అవకాశం ఇవ్వలేదంటూ నగ్మా తీవ్ర అసంతృప్తి..

18 ఏళ్లుగా తనకు అవకాశం ఇవ్వలేదంటూ నగ్మా తీవ్ర అసంతృప్తి..

రాజ్యసభ ఎంపీగా ఉన్న పి చిదంబరం మరోసారి తమిళనాడు నుంచి పోటీ చేయగా, రంజీత్ రంజన్ ఛత్తీస్‌గఢ్ నుంచి బరిలోకి దిగారు. మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తంఖాను పార్టీ అభ్యర్థిగా నిలిపింది. రాజ్యసభకు వెళ్లాలని ఎంతగానో ఎదురుచూస్తున్న నగ్మా తన కోరిక నెరవేరక పోవడంతో నిరసన స్వరం వినిపించారు. 18 ఏళ్ల క్రితం పార్టీలో చేరిన సమయంలో రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చారని కానీ ఇప్పుడా హామీని నిలబెట్టుకోలేదని నగ్మా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+