కాశ్మీర్‌లో: అమర్నాథ్ యాత్రికులపై దాడికి దిగిన టెర్రరిస్ట్‌లు హతం
శ్రీనగర్: గతంలో అమర్నాథ్ యాత్రికులపై దాడికి పాల్పడిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మంగళవారం భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపాయి. ఇందులో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందినవారు.
వీరు గతంలో అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన ముఠాలోని సభ్యులని భద్రతాసిబ్బంది తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో యావర్ బషీర్ అనే వ్యక్తి స్థానిక మిలిటెంట్. అబూ ఫుర్కాన్, అబూ మావియా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నట్లు భద్రతా అదికారులు తెలిపారు. ఈ ఘటనతో అమర్నాథ్ యాత్రికులపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని వారు వెల్లడించారు.
గతంలో యాత్రికులపై దాడికి పాల్పడిన అబు ఇస్మాయిల్‌ను హతమార్చారు. ఇప్పుడు ఆ దాడిలో పాల్గొన్న మరో ముగ్గురిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications