శుభవార్త: అమెజాన్‌లో 6500 తాత్కాలిక ఉద్యోగాలు
న్యూఢిల్లీ: అమెజాన్‌లో 6500 తాత్కాలిక ఉద్యోగులను నియమించుకొంటామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ కామర్స్ ధిగ్గజం అమెజాన్ ఈ నెల 20 నుండి 24వ, తేది వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ను నిర్వహిస్తోంది. దీంతో ఈ తాత్కాలిక ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది.
సీజనల్ నియామకాల్లో భాగంగా సీజనల్ పొజషన్స్ కోసం 6500 మందిని విధుల్లోకి తీసుకుంటున్నామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు. ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, సార్టేషన్ సెంటర్లలో ఈ నియామకాలు ఉంటాయని అన్నారు.

సేల్ పీరియడ్‌లో కస్టమర్ల నుంచి అధిక డిమాండ్‌ను అధిగమించేందుకు 1000 మంది అసోసియేట్స్‌ను నియమిస్తామని చెప్పారు.గ్రేట్ ఇండియన్ సేల్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకొంది.
వినియోగగారులకు మెరుగైన డెలివరీ సేవలు అందించేందుకు అసోసియేట్ల నియామకం తాత్కాలిక ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications