ఈనెల 23, 24 తేదీల్లో అమెజాన్ ''ప్రైమ్ డే సేల్''
అమెజాన్ తన ప్రైమ్ సభ్యుల కోసం ఈనెల 23, 24 తేదీల్లో ప్రైమ్ డే సేల్ నిర్వహించబోతోంది. సెల్ ఫోన్లు, ఇతర యాక్సెసరీస్ పై తగ్గింపు ధరలకే అమ్మకాలుంటాయి. sbi, icici బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసేవారికి 10 శాతం అదనంగా రాయితీ లభించనుంది. శాంసంగ్, యాపిల్, రియల్ మీ, వన్ ప్లస్, శాంసంగ్, వన్ ప్లస్ కంపెనీలకు చెందిన ఫోన్లపై రాయితీలు భారీగా ఉంటాయని అమెజాన్ ప్రకటించింది. తాజా ఐఫోన్ 13 రూ.79,900 కాగా రూ.66,900కే ఈ సేల్ లో విక్రయిస్తున్నారు. పాత ఫోన్ ను మార్పిడి చేసుకోవచ్చు. దీనిద్వారా అదనపు రాయితీ వస్తోంది.
వన్ ప్లస్ బ్రాండ్ కు చెందిన మూడు ఫోన్లపై రాయితీ ఇస్తోంది. రియల్ మీ నార్జో 50 ఏ రూ.11.499 కాగా రూ.8,999కి అమ్ముతున్నారు.
రెడ్ మీ నోట్ 11 రూ.13,499 కాగా, రూ.10,749కే విక్రయిస్తున్నారు.
5జీ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నవారు ఐకూ జడ్ 6 ఫోన్ చూడొచ్చు. ఇది రూ.15,499 కాగా, రూ.12,999కే లభించనుంది.
శాంసంగ్ ఎం 13పై రూ.2 వేలు రాయితీ లభిస్తోంది. రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ ఎం 33 5జీ ఫోన్ రూ.18,999 కాగా, రూ.15,499కే వస్తోంది.

అలాగే ఇయర్ ఫోన్స్, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తగ్గింపు ధరలకే ఈ రెండురోజులు కొనుగోలు చేయవచ్చు. ప్రైమ్ సభ్యులు కాకపోతే నెల, మూడునెలలు, సంవత్సరం ప్లాన్లు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రైమ్ సభ్యులు కాకపోయి ఉంటే అమెజాన్ ఫ్రీ ట్రయల్ ను ఆఫర్ సమయంలో ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్రైమ్ డే సేల్ ద్వారా అమ్మకాలు పెరగడంతోపాటు అమెజాన్ ప్రైమ్ సభ్యుల సంఖ్య పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే భారత్ లో నెట్ ఫ్లిక్స్ ను దాటేచేసిన అమెజాన్ భవిష్యత్తులో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికే ఈ తరహా సేల్స్ ను ప్రకటిస్తోందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications