వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

oxygen కొరత: Amazon భారీ సాయం -10వేల కాన్సంట్రేటర్లు ఎయిర్ లిఫ్ట్, భారత్‌లోని ఆస్పత్రులకు డెలివరీ

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వ్యవస్థల్లో ఒకటైన ఇండియా ప్రస్తుతం కరోనా మహమ్మారి చేతుల్లో చిక్కి విలవిల్లాడుతోంది. రోజువారీ కొత్త కేసులు, మరణాల్లో ప్రపంచ రికార్డులు నమోదవుతున్నాయి. ఆస్పత్రులన్నీ నిండుకున్న వేళ ఆక్సిజన్ కొరత అందరినీ ఏడిపిస్తున్నది. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం తన వంతు కృషి చేస్తుండగా, దేశాన్ని గండం నుంచి గట్టెక్కించడానికి టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీలన్నీ ముందుకొస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు భారీ వితరణలు ప్రకటించగా, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ సంస్థ సైతం భారీ సహాయాన్ని అందిస్తున్నది..

Recommended Video

Karnataka Lockdown : EC Responsible For Second Covid Wave - Madras High Court | Oneindia Telugu

రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..

10వేల కాన్సంట్రేటర్లు

10వేల కాన్సంట్రేటర్లు


కరోనా విలయంతో పోరాడుతోన్న ఇండియాకు సాయం చేయ‌డానికి అమెజాన్ ఇండియా ముందుకు వ‌చ్చింది. స్వచ్ఛంద సంస్థలైన ఏసీటీ గ్రాంట్స్‌, టెమాసెక్ ఫౌండేష‌న్ పుణె ప్లాట్‌ఫామ్ ఫ‌ర్ కొవిడ్‌-19 రెస్పాన్స్‌లతో చేతులు క‌లిపిన అమెజాన్.. అత్య‌వ‌స‌రంగా సింగ‌పూర్ నుంచి 10వేల ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్లను ఇండియాకు తీసుకొస్తున్నది. వాటితోపాటే 500 బై-లెవెల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజ‌ర్ (బైపాప్‌) మెషీన్లు కూడా ఇండియాకు ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. భారత ప్రభుత్వ సహకారంతో ఈ మూడు సంస్థలు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పరికరాలను ఇండియాకు చేరవేయనున్నారు.

జగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబుజగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబు

డెలివరీ బాధ్యత కూడా..

డెలివరీ బాధ్యత కూడా..

ఏసీటీ గ్రాంట్స్‌, పీపీసీఆర్‌, ఇత‌ర సంస్థ‌లు క‌లిసి సింగపూర్ నుంచి 10వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 500 బైపాప్‌ మెషీన్లు కొనుగోలు చేశాయి. వీటిని భారత్ లోని వివిధ ఆస్పత్రులకు డొనేట్ చేయ‌నున్నారు. ఈ మెషీన్ల‌ను ఇండియాకు తీసుకురావ‌డానికి అయ్యే విమాన ఖ‌ర్చుల‌ను మొత్తం అమెజాన్ ఇండియా భ‌రించ‌నుంది. ఎయిరిండియాతోపాటు ఇత‌ర విమాన స‌ర్వీసుల్లో వీటిని ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఈ యంత్రాలు ఇండియా చేరిన తర్వాత వాటిని ఆయా ఆస్పత్రులకు త‌ర‌లించే బాధ్య‌త కూడా అమెజాన్ ఇండియానే తీసుకుంది.

కష్ట సమయంలో దేశానికి అండగా..

కష్ట సమయంలో దేశానికి అండగా..

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, బైపాప్‌ మెషీన్లకు సంబంధించి తొలి కన్‌సైన్‌మెంట్ ఇప్ప‌టికే ముంబైలో ల్యాండైంది. ఈ నెల 30లోగా అన్ని ప్రాంతాలకు వాటిని చేరవేస్తామని అమెజాన్ ఇండియా గ్లోబ‌ల్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగ‌ర్వాల్ చెప్పారు. కొవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల ఇండియా ఊహించ‌ని రీతిలో ప్ర‌భావిత‌మైందని, ఈ కష్ట స‌మ‌యంలో దేశానికి అండ‌గా ఉంటామని, అందులో భాగంగానే ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్లను సింగ‌పూర్ నుంచి ఎయిర్‌లిఫ్ట్ చేయ‌నున్నామ‌ని, రాబోయే రోజుల్లో మరిన్ని కాన్సంట్రేటర్లు, అవసరమైన ఇతర మెడికల్ పరికరాలను కూడా డెలివరీ చేస్తామని అగర్వాల్ తెలిపారు.

English summary
To help hospitals and health institutions struggling to provide oxygen to patients affected by covid-19, Amazon India has joined hands with ACT Grants, Temasek Foundation, Pune Platform for Covid-19 Response (PPCR) along with other partners to urgently airlift over 8,000 oxygen concentrators and 500 bi-level positive airway pressure (BiPAP) machines from Singapore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X