వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిల్లీలో కొత్త మోటారు వాహన చట్టం...! ఒక్కరోజే... 4000 వాహనాలపై జరిమానాలు...!

|
Google Oneindia TeluguNews

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మోటారు వాహన చట్ట సవరణపై డిల్లి ప్రభుత్వం అప్పుడే కొత్త జరిమానాలను విధించింది. సెప్టెంబర్ ఒకటి నుండి కొత్త వాహన చట్టం అమల్లోకి రావడంతో ఆదివారం ఒక్కరోజే సుమారు 4000మంది వాహానదారులకు కొత్త చట్టం ప్రకారం జరిమానాలు వేసి, చాలన్లను పంపినట్టు డిల్లీ ట్రాఫిక్ అధికారులు తెలిపారు. అయితే కొత్త వాహన సవరణ చట్టం అమలు ,ఆయా రాష్ట్రాల ఇష్టానికి వదిలిపెట్టిన నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్ ,మధ్యప్రదేశ్, రాష్ట్రాలు దీని అమలుకు నిరాకరించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాలు నూతన జరిమానలపై సమీక్ష జరుపుతున్నాయి.

రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రమాదాలు, మరణాల నియంత్ర కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటారువాహానాల చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఆ సవరణ బిల్లు సెప్టెంబర్ ఒకటి నుండి అమలులోకి వచ్చింది. ఇందుకోసం కేంద్రం నోటిఫికేషన్ కూడ విడుదల చేసింది.ఇందులో భాగంగానే ట్రాఫిక్ నిబంధనలు, వాహానాల చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై భారిగానే జరిమానాలు విధించింది. అయితే ఈ చట్టం అమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీద అధారపడి ఉంటుంది.

amended Motor Vehicles Act came into force in delhi,

ఇక కేంద్ర తీసుకువచ్చిన చట్టంలో భారీ ఎత్తున జరిమానాలు తీసుకువచ్చింది. ముఖ్యంగా లైసెన్స్ లేకుంటే 50000 , హెల్మెంటే లేకుండా నడిపితే 2000 ,సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనం నడిపితే 1000 రుపాయాల జరిమానా కాగా మద్యం సేవించి పట్టుపడినా, అత్యవసర వాహానాలకు దారి ఇవ్వకున్నా పదివేల రుపాయాల జరిమాన విధించనున్నారు. మరోవైపు అతివేగం తో పట్టుపడిన వాహానాలకు కూడ రూ 2000 జరిమాన విధించనున్నారు.

English summary
On Sunday when the amended Motor Vehicles Act came into force with heavier penalties for traffic offences, the Delhi Traffic Police prosecuted nearly 3,900 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X