వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తులను సైతం తీవ్రవాదులుగా ప్రకటించే బిల్లు... లోక్‌సభలో అమోదం...

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాద నిరోధక చట్టం సవరణ బిల్లు విపక్షాల అనేక ఆందోళనల మధ్య ఆమోదం పోందింది. ఈ బిల్లు సవరణతో ఏ తీవ్రవాద సంస్థతో సంబంధంలేని వ్యక్తులను కూడ తీవ్రవాదులుగా గుర్తించి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాగా బిల్లుకు అనుకూలంగా 284మంది ఎంపీలు మద్దతు పలకగా కాంగ్రెస్ పార్టీతో ఇతర ప్రతిపక్షాలు బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశాయి.

బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన విపక్షాలు

బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన విపక్షాలు

ఇప్పటివరకు తీవ్రవాద సంస్థలకు అనుకూలంగా పని చేసే వ్యక్తులతో పాటు ఆయా సంస్థలపై తీవ్రవాదుల ముద్ర వేసి కేసులు పెట్టేవారు. ఈ నేపథ్యంలోనే తీవ్రవాద సంస్థల్లో పనిచేసే వ్యక్తులు ఆయా సంస్థను నిషేధించడంతో ఇతర సంస్థల్లో చేరడం లేదా మరో గ్రూపును నిర్వహించడమో జరుగుతుందని భావించిన ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక బిల్లులో చట్టసవరణ తెచ్చింది. దీంతో ఈ బిల్లుపై గత పార్లమెంట్‌లో వాడి వేడి చర్చ జరిగింది. బిల్లును కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశాయి.

వ్యక్తులను టార్గెట్ చేసే అవకాశం ఉందంటూ విపక్షాల ఆందోళన

వ్యక్తులను టార్గెట్ చేసే అవకాశం ఉందంటూ విపక్షాల ఆందోళన


ముఖ్యంగా కేంద్రం వ్యక్తులను టార్గెట్ చేసి వారిపై తీవ్రవాద ముద్ర వేసే అవకాశం ఉందని తృణముల్ కాంగ్రెస్‌తో పాటు,కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాదించారు. చట్టాలను అడ్డం పెట్టుకుని సామాజికంగా ఉద్యమించే వారిపై అక్రమంగా కేసులు పెట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కోన్నాయి. చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులు, మైనారీటిలు,రైట్ వింగ్ కార్యకర్తలను కూడ వేధించే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.

 అర్భన్ తీవ్రవాదాన్ని అంతం చేస్తాం... అమిత్ షా

అర్భన్ తీవ్రవాదాన్ని అంతం చేస్తాం... అమిత్ షా

అయితే బిల్లును సమర్ధిస్తూ కేంద్రహోంత్రి అమిత్ షా లో‌క్‌సభలో మాట్లాడారు. ఇలాంటీ ప్రోవిజన్ అమేరికా,చైనా, ఇజ్రాయిల్‌, పాకిస్థాన్‌తోపాటు చాలా దేశాల్లో ఉందని సమర్ధించారు. ఈ నేపథ్యంలోనే తీవ్రవాద సంస్థను బహిష్కరిస్తే సభ్యులు ఇతర సంస్థల్లోకి వెళుతున్నారని తెలిపారు.అయితే నిజాయితి పని చేసే వారిపై ఎలాంటీ కేసులు ఉండవని అమిత్ షా హామి ఇచ్చారు.చాల మంది సామాజికవేత్తలు ప్రజలకు మేలు చేస్తున్నారని ,అయితే కొంతమంది సోషల్ సర్వీసు ముసుగులు టెర్రరిజానికి మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఈనేపథ్యంలోనే అర్భన్ మావోయిజాన్ని అంతం చేయాల్సి అవరసం ఉందని ఆయన పేర్కోన్నారు.

English summary
The government can designate individuals suspected to have terror links as "terrorists" if controversial changes to a counter-terrorism law are cleared in parliament. Amendments to the Unlawful Activities Prevention (Amendment) Bill were passed in the Lok Sabha today with 284 votes in its favour and eight against it after the opposition walked out in protest, calling it draconian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X