పాకిస్థాన్ మీకే మంచిది కాదు: అమెరికా
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను ప్రోత్సహిస్తే మీకే మొదటికి మోసం వస్తుందని అమెరికా పాకిస్థాన్ కు పరోక్షంగా హెచ్చరించింది. హింసను ప్రోత్సహించడం మీకు మంచిది కాదని, పాకిస్థాన్ లోని అన్ని రాజకీయ పార్టీలను అమెరికా కోరింది. స్వేచ్చ, భావప్రకటన శాంతియుత ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.
హింసాత్మక విధానాలకు దూరంగా ఉండాలని పాకిస్థాన్ కు సూచింది. సమూహ స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛకు మేము ఎప్పుడు అండగా ఉంటాం. అందుకు అనుగుణంగా మెలగుతుంటాం. శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు అందరికీ ఉందని అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.

ఆందోళన నిర్వహించే రాజకీయ పార్టీలు హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని, సంయమనంతో వ్యవరించాలని అమెరికా సూచించింది. పాకిస్థాన్ లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఈవిధంగా స్పందించారు.
పాకిస్థాన్ లో ప్రభుత్వాన్ని సైన్యం నియంత్రింస్తోందన్న ఆరోపణలపై స్పందించేందుకు కిర్బీ నిరాకరించారు. ఇది పాకిస్థాన్ అంతర్గత విషయం, దీనిపై తాము కామెంట్ చెయ్యలేమని చెప్పారు. పాకిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలను కనిపెట్టి చూస్తున్నామని ఆయన వెల్లడించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను గద్దె దించేందుకు పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ ముట్టడికి మంగళవారం పిలుపునిచ్చారు. పనామా పత్రాల కుంభకోణంలో నవాజ్ షరీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications