చికిత్స తర్వాత మనోహర్ పారికర్‌లో మార్పు! అధికారులతో సమీక్ష, ఫోటో విడుదల

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన ఫోటోను విడుదల చేసింది. అధికారులతో కలిసి కూర్చున్న ఫోటోను రిలీజ్ చేసింది. గత కొన్నాళ్లుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందిన ఆయన పదిహేను రోజుల క్రితం ఇంటికి వచ్చారు. కానీ బయట కనిపించలేదు.

సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం కనిపించాయి. ఆగస్ట్ 22వ తేదీన ఆయన చివరి ఫోటో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ తర్వాత కనిపించలేదు. ఇప్పుడు అధికారులతో ఉన్న ఫోటోను సీఎం కార్యాలయం విడుదల చేసింది.

Amid reports of poor health, Chief Minister’s Office releases image of Manohar Parrikar

పారికర్‌ క్లోమ కేన్సర్‌తో బాధపడుతున్నారని ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం ఇంచికి వచ్చారని, డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె మూడు రోజుల క్రితం చెప్పారు. అదే సమయంలో పారికర్‌ ఆరోగ్యంపై కాంగ్రెస్‌ సందేహాలు వ్యక్తం చేసింది. బీజేపీ దానిని తిప్పికొట్టింది.

ఈ నేపథ్యంలో మంగళవారం పారికర్‌ ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో భేటీ అయిన చిత్రాన్ని గోవా సీఎంవో తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచింది. ఆయనలో శారీరక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేన్సర్‌కు చికిత్స ప్రభావం ఆయన శరీరంపై పడినట్లు అర్థమవుతోంది.

పనాజీలోని ఆయన నివాసంలో గోవా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్స్‌ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారికర్‌తోపాటు ఐటీ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+