అమిత్ షా హిందువు కాదు: ఎందుకు బీజేపీ అధ్యక్షుడిని చేశారు, కర్ణాటక మంత్రి సూటి ప్రశ్న!
బెంగళూరు: అమిత్ షా హిందువు కాదు, ఎందకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేశారు అంటూ కర్ణాటక మంత్రి వినయ్ కులకర్ణి ఆ పార్టీనాయకులు, ఆర్ ఎస్ఎస్ ను ప్రశ్నించారు. అమిత్ షా హిందువు కానప్పుడు ఎందుకు ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేశారో బీజేపీ నాయకులు చెప్పాలని మంత్రి వినయ్ కులకర్ణి డిమాండ్ చేశారు.
బెళగావిలోని నాగనూరు మఠం కాలేజ్ ఆవరణంలో సోమవారం మంత్రి వినయ్ కులకర్ణి మీడియాతో మాట్లాడారు. లింగాయిత్ కులస్తులకు ప్రత్యేక ధర్మం కావాలని చేస్తున్న పోరాటానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వాటి అనుబంధ సంస్థలు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని మంత్రి వినయ్ కులకర్ణి ప్రశ్నించారు.

లింగాయిత్ కులస్తులకు ప్రత్యేక ధర్మం వస్తే హిందూ ధర్మానికి మచ్చ వస్తుందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు భయపడుతున్నారని మంత్రి వినయ్ కులకర్ణి అన్నారు. హిందూ ధర్మం కాపాడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులు జైన్ మతంకు చెందిన అమిత్ షాను ఆ పార్టీ అధ్యక్షుడిని ఎలా చేశారు అనే విషయం చెప్పాలని ప్రశ్నించారు.
నేను లింగాయిత్ కులంలో పుట్టాను, ఈ కులం కారణంగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు, కులం ఆధారంగానే మంత్రిని అయ్యానని వినయ్ కులకర్ణి గుర్తు చేశారు. లింగాయిత్ కులస్తులకు ప్రత్యేక ధర్మం కావాలని తాను పోరాటం చేస్తుంటే కొందరు బెదిరిస్తున్నారని, తన మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారని మంత్రి వినయ్ కులకర్ణి బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications