వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్లో అమిత్‌షా సమరశంఖం- బీజేపీకి 200 సీట్లని జోస్యం- సువేందు చేరిక

|
Google Oneindia TeluguNews

పశ్చిమబెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ సమరశంఖం పూరించారు. ఎన్నికల్లో గెలవాలంటే అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పై ఏదో రకంగా పైచేయి సాధించక తప్పని పరిస్దితుల్లో బెంగాల్లో అడుగుపెట్టిన అమిత్‌షా .. సీఎం మమతా బెనర్జీని టార్గెట్‌ చేశారు. ఆమె తన మేనల్లుడిని సీఎం చేసేందుకే ఆరాటపడుతోందన్నారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రవాణాశాఖ మంత్రి సువేందు అధికారి ఇవాళ అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు టీఎంసీ రెబెల్‌ నేతలు సునీల్‌ మండల్‌, సిభద్రా దత్తా కూడా కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్‌షా.. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మమత ఇతర పార్టీల నుంచి బీజేపీ నాయకులను తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు.

amit shah launches bjp campaign in bengal, says mamata worried for nephew as cm

ఆమె కాంగ్రెస్‌లో ఉన్నప్పటి రోజులు గుర్తుచేసుకోవాలి, ఆమె ఎందుకు భయపడుతున్నారని అమిత్‌షా ప్రశ్నించారు. తామెందుకు అలా ఉండిపోవాల్సి వస్తోందని యువత ప్రశ్నించుకోవాలి, మీకు ఎందుకు కేవలం కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలు మాత్రమే అందుతున్నాయని రైతులు ప్రశ్నించాలని అమిత్‌షా కోరారు.

amit shah launches bjp campaign in bengal, says mamata worried for nephew as cm

మీరు కాంగ్రెస్‌కు మూడు దశాబ్దాలు, కమ్యూనిస్టులకు 27 సంవత్సరాలు, మమతా బెనర్జీకి పదేళ్లు అధికారమిచ్చారు. బీజేపీకి ఐదేళ్లు అధికారమిచ్చి చూడండి సోనార్‌ బంగ్లా చేసి చూపిస్తామంటూ బెంగాల్‌ ప్రజలను అమిత్‌షా కోరారు. బెంగాల్‌ మొత్తం మమతు వ్యతిరేకంగా ఉందని, ఇక్కడి రైతులు, శ్రామికుల సమస్యలను ప్రధాని మోడీ చూసుకుంటారని షా అన్నారు. సువేందు అధికారితో పాటు ఇతర నేతలు బీజేపీలో చేరడం సోనార్ బంగ్లా కోసమేనన్నారు. బెంగాల్లో ఈసారి తాము 200 పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.

English summary
union home minister amit shah has launched bjp's poll campaign in west bengal today. amit shah welcomes tmc key leader suvendu adhikari's joining into bjp. and says cm mamata is worried about his nephew to made next chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X