బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా: ఎవరితను?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు అయిన అమిత్ షా నియమితులయ్యారు. అమిత్ షాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అమిత్ షాకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలున్నాయని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బుధవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఎవరీ అమిత్ షా?

అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు. ఆయన పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. 1964 అక్టోబర్ 22వ తేదీన జన్మించారు. ఆయనకు మొదటి నుండి ఆర్ఎస్ఎస్‌తో పరిచయం ఉంది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎంలలో చురుగ్గా పని చేశారు. 1997లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గుజరాత్ ప్రభుత్వంలో పలు కీలక శాఖలు చేపట్టారు. హోం, న్యాయ, శాంతిభద్రతలు, ఎక్సైజ్, రవాణా శాఖ తదితరాలను ఆయన నిర్వహించారు. ఆయన 1986లో బీజేపీలో చేరారు. 1997లో సార్‌కేజ్ నుండి ఆయన గెలుపొందారు. కాలేజీ రోజుల నుండి ఆరెస్సెస్‌తో అనుబంధం ఉంది. ఇటీవల జరిగి సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ 80 స్థానాలకు గాను 72 స్థానాల్లో గెలిచింది. ఈ క్రెడిట్ షాదే.
యూపీ ఫలితాలతో ఆయన జాతీయ దృష్టిని ఆకర్షించారు. గోద్రా అల్లర్లు, సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులు ఆయన పైన ఉన్నాయి. 1964లో పుట్టిన అమిత్ షా మహారాష్ట్రలోని ముంబైలో పుట్టారు. 2003 నుండి 2010 వరకు మోడీ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఇతను జైన మతానికి చెందిన వారు. అమిత్ షా భార్య సోనాల్ షా. ఒక కొడుకు జై షా ఉన్నారు.












Click it and Unblock the Notifications