అమిత్ షా ప్రయత్నం విఫలం..!
రాజస్థాన్‌లో రాజకీయం రంజుగా మారింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం వసుంధరా రాజేను సీఎం అభ్యర్థిగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించకపోవడంతో ఆమె వర్గం ఒక్కింత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో బీజేపీకి రెబెల్స్ గొడవ తప్పలేదు. ఇక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో రెబెల్స్‌ను బుజ్జగించేందుకు ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు.
రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరారాజే అనుచరుడు, విధేయుడు అయిన రాజ్‌పాల్ సింగ్ షెకావత్‌ను బీజేపీ అధినాయకత్వం కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. రెబల్‌గా బరిలో దిగాలనే యోచనలో ఉన్న రాజ్‌పాల్ సింగ్ కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. అయితే బీజేపీ రెబెల్స్‌గా మరో 25 మంది అభ్యర్థులు కమలం పార్టీ అభ్యర్థులపై పోటీలో ఉన్నారు. అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్‌లు వారిని కన్విన్స్ చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి.

రెబల్ అభ్యర్థులుగా ఉన్నవారు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలోనుంచి తప్పుకుని అధికారికంగా బీఫామ్ అందుకున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందిగా చెప్పే ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినట్లు సమాచారం. కేంద్రహోంమంత్రి అమిత్ షా స్వయంగా రాజ్‌పాల్‌తో ఫోన్‌లో టచ్‌లోకి రావడంతో రాజ్‌పాల్ రెబెల్‌గా తప్పుకున్నట్లు సమాచారం. ఈయన మాజీ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జోత్వారా నియోజకవర్గం నుంచి రెబల్‌గా బరిలోకి దిగారు. మరో రెబెల్ అభ్యర్థి అశు సింగ్ సుర్పురాను కన్విన్స్ చేసినప్పటికీ తాను మాట వినకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు.
ఇదిలా ఉంటే రాజస్థాన్‌లో అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాగైన విజయం సాధించి ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ చాలా కష్టపడుతోంది. అయితే వీరికి రెబల్స్ నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో తిరిగి కాంగ్రెస్‌కు అది అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది. మాజీ ఎమ్మెల్యే యూనస్ ఖాన్ 2013 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వసుంధరా రాజేకు విధేయుడనే ముద్ర ఉంది. 2018లో టాంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ పై పోటీకి దింపింది బీజేపీ. అయితే పైలట్ పై యూనస్ ఖాన్ ఓటమిపాలయ్యాడు. ఆ ఏడాది ముస్లిం సామాజిక వర్గం నుంచి బీజేపీ తరపున పోటీలో నిలిచిన ఏకైక వ్యక్తి యూనస్ ఖాన్.మరో వైపు ఈ సారి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బరిలోకి దింపకపోవడం చర్చనీయాంశమైంది.

"బీజేపీకి నేను 25 ఏళ్లు సేవ చేశాను. వారినుంచి ఎలాంటి పదవిని ఆశించలేదు.ఈ సారి ఎన్నికల్లో నన్ను దూరంపెట్టడాన్ని బాధించింది. నా నియోజకవర్గ ప్రజలు కూడా చాలా బాధపడ్డారు. నన్ను ఇండిపెండెంట్‌గా పోటీ చేయమని ప్రోత్సహించారు. వారంతా బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు.వారి కోరికను కాదనలేను. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నాను" అంటూ మాజీ ఎమ్మెల్యే యూనస్ ఖాన్ చెప్పుకొచ్చారు.
ఇలా చాలామంది రెబల్ అభ్యర్థులకు ఎవరి కారణాలు వారికి ఉండటం, వారు పోటీ చేస్తుండటంతో ఓట్లు చీలి కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ కనిపిస్తోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications