కాంగ్రెస్ వరుస వైఫల్యాలకు అసలు కారణం ఇదే: అమిత్ షా
పార్లమెంటులో ఓటరు జాబితా సమగ్ర సవరణ(SIR) ప్రక్రియపై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ గందరగోళం సృష్టించడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ విషయంపై కాంగ్రెస్ కొన్ని నెలలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. అసలు ఓట్ చోరీ ఎప్పుడు మొదలైందో తాను చెప్పదలచుకున్నానని అన్నారు. అసలు ఓట్ చోరీ అంటే ఏంటి..? అన్న ప్రశ్నకు పలు విధాలుగా సమాధానం ఇచ్చారు అమిత్ షా. అలాగే కాంగ్రెస్ హయాంలోనే 3 సార్లు ఓట్ చోరి జరిగిందని షా స్పష్టం చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీలు ఇందుకు ఉదాహరణలని వివరించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ప్రధానిని ఎన్నుకునే సమయంలోనే ఓట్ చోరీ జరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుల ఓట్ల పరంగా ప్రధానిని ఎన్నుకోవాలి.. సర్దార్ పటేల్ కు 28 ఓట్లు రాగా.. నెహ్రూకు కేవలం 2 ఓట్లు మాత్రమే వచ్చాయి.. కానీ జవహర్ లాల్ నెహ్రూనే ప్రధానిగా ఎన్నికయ్యారని అమిత్ షా నొక్కి చెప్పారు. ఈ క్రమంలో సభలో కాంగ్రెస్ ఎంపీలు గందరగోళం సృష్టించారు.
అలాగే ఇందిరాగాంధీ ప్రధాని అయ్యే సమయంలోనూ ఓట్ చోరీ జరిగిందన్నారు. ఇందిరా గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి గెలిచినప్పుడు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రెండోసారి ఓట్ చోరీ జరిగిందని అమిత్ షా గుర్తు చేశారు. ఇక మూడో ఉదాహరణగా సోనియా గాంధీ అంశం ప్రస్తావించారు అమిత్ షా. సోనియాగాంధీ భారత్ పౌరురాలు కాకముందే దేశ ఓటర్ అయ్యారని ఆరోపణలు చేశారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్ వరుస వైఫల్యాలకు కారణం సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడమేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు చేతకాక ఓట్ చోరీ విధానాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. నాయకత్వం లోపంతోనే ఇటీవల బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని.. ఈవీఎంలు, ఓటర్ లిస్టులు కాదని తెలిపారు. ఏదోరోజు ఆ పార్టీకి.. వాళ్ల నేతలే నాయకత్వంపై ప్రశ్నలు సంధిస్తారని అన్నారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం.. కేంద్రం పరిధిలో పనిచేయదని క్లారిటీ ఇచ్చారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ(SIR) ప్రక్రియ పూర్తిగా ఎన్నికల సంఘం చేతిలో పని అని ఆ అంశాన్ని పార్లమెంటులో చర్చించడం తగదని స్పష్టం చేశారు.
అయితే అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఓట్ చోరీ అంశంపై తనతో చర్చకు సిద్ధమా..? అని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఓట్ చోరీ అంశంపై గతంలో తాను నిర్వహించిన మూడు ప్రెస్ కాన్ఫరెన్స్ లపైనా చర్చించేందుకు సిద్ధమని అన్నారు. ఈ మేరకు కేంద్రం, ఈసీ, అమిత్ షా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హరియాణాలో 19 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు. తాము ప్రస్తావించిన ఏ అంశానికి కూడా అమిత్ షా సరైన సమాధానం ఇవ్వలేదని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు పార్లమెంటులో ఇరు నేతల మధ్య వాడీవేడీగా చర్చ జరిగింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications